పాఠశాల లో ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం
మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల రాంపురంలో ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం నిర్వహించడం జరిగింది. విద్యార్థులే ఒకరోజు ఉపాధ్యాయులుగా ఉండి పాఠాలు బోధించడం జరిగింది. ఈ స్వయం పరిపాలన దినోత్సవం లో డీఈఓ గా దిడ్డి భవిత,ఎంఈఓ గా హర్షిత్, ప్రధానోపాధ్యాయులుగా చింత పార్థు,సీఆర్పీగా రాఘవ,పిఈటి గా భరత్, ఉపాధ్యాయులుగా రితిక, సంవిద,యశ్విత,సిరి,రేవాంతిక,భాను పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు గుగులోతు హీరాలాల్ ఉపాధ్యాయులు గుర్రం వెంకన్న గౌడ్,రాజేశ్వరి, శ్రీధర్,కనకం గణేష్,బంధు పరశురాములు,మంజుల తదితరులు పాల్గొన్నారు.