పెద్దూరి రామ్ నరసయ్య సతీమణి సావిత్రికి పరామర్శ
పాలకుర్తి మండల కేంద్రానికి చెందిన పాలకుర్తి మేజర్ గ్రామపంచాయతీ వార్డు సభ్యులు కామారపు సునీల్ మామ ప్రముఖ వ్యాపారవేత్త, క్రీ” శే ” పెద్దూరి రామ్ నరసయ్య సతీమణి సావిత్రి ఇటీవల జరిగిన విషాదకర బస్సు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఒక చేతిని కోల్పోయారు. ఆసుపత్రిలో చికిత్స పూర్తి చేసుకుని ప్రస్తుతం ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్న సావిత్రి ని పాలకుర్తి మేజర్ గ్రామపంచాయతీ మాజీ సర్పంచ్ విరమనేని యాకంతరావు మర్యాదపూర్వకంగా పరామర్శించారు.ఈ సందర్భంగా సావిత్రి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, ఆమె త్వరగా సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవాలని ఆకాంక్షించారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెబుతూ, ఈ క్లిష్ట సమయంలో అందరూ అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న పాలకుర్తి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు సలేంద్ర శ్రీనివాస్, కమ్మగాని గుణ మహేందర్ మరియు కుటుంబ సభ్యులు పాల్గొని సావిత్రి కి ధైర్యం చెప్పి, ఆమె త్వరగా కలుకోవాలని ఆకాంక్షించారు.