
ఈ69న్యూస్ హనుమకొండ: ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం కార్యక్రమాలు చేపడుతోందని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ తెలిపారు.మంగళవారం దామెర మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా నిర్వహించిన ప్రత్యేక వైద్య శిబిరాన్ని కలెక్టర్ ప్రారంభించారు.ఈ శిబిరంలో స్త్రీరోగాలు, జనరల్ మెడిసిన్, ఎముకలు–కీళ్లు, కంటి, దంత, పిల్లల వైద్య నిపుణులు పాల్గొని ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందించారు. మొత్తం 375 మంది రోగులకు పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు.అనంతరం కలెక్టర్ ఓపి నమోదు, ఫార్మసీ తదితర విభాగాలను పరిశీలించి ప్రజలకు అందుతున్న వైద్య సేవలపై వైద్యులు, సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.ఈ కార్యక్రమంలో డిఎంహెచ్వో డాక్టర్ అప్పయ్య, పరకాల ఆర్డీఓ డాక్టర్ కన్నం నారాయణ, తహసీల్దార్ జ్యోతి వరలక్ష్మి దేవి, సర్పంచ్ కల్పన, వైద్యాధికారులు డాక్టర్ మహేంద్ర, డాక్టర్ రాజ్ కుమార్, డాక్టర్ శాంతి ప్రియ, డాక్టర్ ఎస్కే జాస్మిన్ మెహర్, డాక్టర్ ప్రమోద్ తదితరులు పాల్గొన్నారు.