KVPS
-కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు నాగార్జున
కట్టంగూరు, జూన్ 19:
విద్య, వైద్యం వంటి మౌలిక సేవలను ఉచితంగా అందించాలన్న డిమాండ్‌తో కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు నాగార్జున కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు.కట్టంగూరు మండల కేంద్రంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు.నాగార్జున మాట్లాడుతూ..ప్రభుత్వాలు మారుతున్నా సంక్షేమ పథకాల రూపమే మారుతోందని,పేదల జీవితాల్లో మాత్రం ఎలాంటి మార్పు లేదని అన్నారు. దళిత,గిరిజన కార్పొరేషన్లు నిర్వీర్యం కాగా,పరిశ్రమల ద్వారా రావలసిన సబ్సిడీలు మూడు సంవత్సరాలుగా అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా ఈనెల 22, 23 తేదీల్లో కట్టంగూరు వైవిఆర్ ఫంక్షన్ హాల్లో రెండు రోజుల రాజకీయ శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు తెలిపారు.జిల్లావ్యాప్తంగా 33 మండలాల నుండి 200 మంది ప్రతినిధులు ఈ తరగతుల్లో పాల్గొననున్నారని వెల్లడించారు.ఈ సమావేశంలో కెవిపిఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు ఒంటెపాక కృష్ణ,మండల కార్యదర్శి చిలుముల రామస్వామి,సీఐటీయూ నాయకులు పెంజర్ల సైదులు,రాజేష్ తదితరులు పాల్గొన్నారు.