
ఈ69న్యూస్ న్యూఢిల్లీ/వరంగల్
న్యూ ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద మంగళవారం మాల మహానాడు ఆధ్వర్యంలో జరిగిన “మాలల పోరాట గర్జన సభ” విజయవంతమైంది.సభలో జాతీయ అధ్యక్షుడు డా. పసుల రాంమూర్తి మాట్లాడుతూ.. “ఎస్సీ వర్గీకరణ దళితులను విభజించే కుట్ర.ప్రాణాలైనా అర్పించి దీన్ని అడ్డుకుంటాం” అని హెచ్చరించారు.ఆయన 11 ప్రధాన డిమాండ్లను ప్రభుత్వాల ముందు ఉంచారు.వాటిలో ఎస్సీ రిజర్వేషన్లు 20% చేయడం, మూడెకరాల భూమి పంపిణీ,ప్రైవేట్ రంగాల్లో రిజర్వేషన్లు,కేజీ-పీజీ ఉచిత విద్య, బ్యాక్లాగ్ పోస్టుల భర్తీ ముఖ్యమైనవిగా ఉన్నాయి.ఈ సభకు నాగర్ కర్నూలు ఏం.పి. మల్లు రవి మద్దతు తెలిపారు.