
ఈ69న్యూస్ హైదరాబాద్:
తెలంగాణ రాష్ట్ర ఆర్థిక & ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన తాజా బడ్జెట్‌పై తెలంగాణ జాగృతి జిల్లా అధ్యక్షుడు గుంజపడుగు హరిప్రసాద్ తీవ్ర విమర్శలు చేశారు. ఈ బడ్జెట్ రాష్ట్ర ప్రజలను, ముఖ్యంగా మహిళలను పూర్తిగా నిరాశపరిచిందని ఆయన అన్నారు.బీసీల సంక్షేమానికి ప్రతి సంవత్సరం ₹20,000 కోట్ల నిధులు కేటాయిస్తామని ఇచ్చిన హామీని కాంగ్రెస్ ప్రభుత్వం నిలబెట్టుకోలేదని, కేవలం ₹12,000 కోట్లు మాత్రమే కేటాయించడం ద్వారా బీసీలను మోసం చేసిందని విమర్శించారు. అలాగే కళ్యాణలక్ష్మి పథకంలో తులం బంగారం ఇస్తామని చెప్పి అమలు చేయకపోవడం మహిళలపై మరోసారి మోసమని పేర్కొన్నారు.ఆరు గ్యారంటీలలో ముఖ్యమైన మహిళలకు నెలకు ₹2,500 ఆర్థిక సాయం కూడా బడ్జెట్లో ప్రస్తావించకపోవడం గమనార్హమన్నారు. పింఛన్ల విషయంలో నాలుగు వేల రూపాయలు ఇస్తామని చెప్పి అమలు చేయకపోవడం వృద్ధులపై అన్యాయం చేశారని అన్నారు.పేదల విద్య, వైద్య రంగాలకు సరైన నిధులు కేటాయించలేదని, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల సంక్షేమంలో కూడా వివక్ష చూపారని ఆరోపించారు. యువతకు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చి, బడ్జెట్లో జాబ్ క్యాలెండర్ ప్రస్తావన కూడా లేకపోవడం నిరుద్యోగులను మోసం చేయడమేనని అన్నారు.
జర్నలిస్టుల సంక్షేమానికి కనీస ప్రాధాన్యం ఇవ్వలేదని పేర్కొంటూ, ఈ బడ్జెట్ అన్ని వర్గాల ప్రజలను మోసం చేసేలా ఉందని గుంజపడుగు హరిప్రసాద్ తీవ్రంగా విమర్శించారు.