బహిరంగ సభకు వేలాదిగా తరలిరండి
సిపిఐ జనగామ జిల్లా కార్యవర్గ సభ్యులు జువారి రమేష్ పిలుపు జనగామ జిల్లా జఫర్ఘడ్ మండల కేంద్రంలో భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) మండల కమిటీ ఆధ్వర్యంలో “ఛలో ఖమ్మం”బహిరంగ సభ కరపత్రాలను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు, మండల కార్యదర్శి జువారి రమేష్ మాట్లాడారు.సిపిఐ పార్టీ అనేక త్యాగాలు చేసి ప్రజలకు హక్కులను సాధించి పెట్టిన ఘన చరిత్ర కలిగిన పార్టీ అని ఆయన పేర్కొన్నారు. నగరాల్లో పేద ప్రజల కోసం వందల ఎకరాల ప్రభుత్వ భూములపై గుడిసెలు వేసి పట్టాలు ఇప్పించేందుకు రాజీలేని పోరాటాలు చేసి లక్షలాది మందికి భూమిపై చట్టబద్ధమైన హక్కులు కల్పించిన ఘనత సిపిఐకే దక్కుతుందని తెలిపారు.ఇలాంటి చారిత్రక నేపథ్యం కలిగిన సిపిఐ పార్టీ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా జనవరి 18న ఖమ్మం నగరంలో జరిగే బహిరంగ సభకు కార్యకర్తలు,అభిమానులు వేలాదిగా తరలి వచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.ప్రజా పోరాటాలకు కేరాఫ్ అడ్రస్ ఎర్రజెండానే తప్ప మరొకటి కాదని స్పష్టం చేశారు.పాలకులకు పేద ప్రజల పట్ల చిత్తశుద్ధి లేకపోవడం వల్ల ఆశించిన అభివృద్ధి జరగలేదని విమర్శించారు.ఈ పరిస్థితుల్లో శ్రమనే నమ్ముకుని జీవించే కార్మిక వర్గానికి నాయకత్వం వహిస్తూ,యాజమాన్యాల ఆధిపత్యానికి వ్యతిరేకంగా పోరాటాలు నిర్వహిస్తున్న ఏకైక పార్టీ కమ్యూనిస్టు పార్టీ అని అన్నారు.విద్యార్థులు,యువజనులు,మహిళలు,రైతులు,బుద్ధిజీవులు వంటి వివిధ వర్గాల హక్కుల కోసం సంఘాలను ఏర్పాటు చేసి వారి సమస్యల పరిష్కారానికి సిపిఐ పార్టీ నిరంతరం కృషి చేస్తోందని వివరించారు.ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు ఎండి యాకుబ్ పాషా,మంద బుచ్చయ్య,బుల్లె దూడయ్య,ఎండి జాఫర్,అన్నెపు అజయ్,బుల్లె లింగయ్య,హరికృష్ణ,బుల్లె సాయులు తదితరులు పాల్గొన్నారు.