బహుజన నూతన ఉద్యమ రథ సారథులను కలిసిన పార్వతి రమేష్ నాయక్
తెలంగాణ లో బహుజన రాజ్యం లక్ష్యంగా భారత దేశ బహుజన ఉద్యమ రథసారథి జాతీయ అధ్యక్షులు,నాలుగు సార్లు ఉత్తర ప్రదేశ్ ముఖ్య మంత్రి, మాజీ రాజ్య సభ సభ్యురాలు ఆదరణీయ గౌరవీయురాలు బహెన్ కుమారి మాయావతి,జాతీయ సమన్వయ కర్త గా మాజీ ఉత్తర ప్రదేశ్ ఎమ్మెల్సీ అత్తార్ సింగ్ రావుని,అలాగే మాజీ బహుజన్ సమాజ్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు గారిని సెంట్రల్ స్టేట్ కోఆర్డినేటర్ గా, అలాగే మాజీ డిప్యూటీ మేయర్ బడంగ్పేట్ ఇబ్రామ్ శేఖర్ ని తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు గా నియమించడం జరిగింది.ఉత్తరప్రదేశ్ లక్నో లో 27 వ తారీకున జరిగిన కార్యక్రమం లో తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు గా నూతనముగా నియామకం చేయబడిన ఇబ్రామ్ శేఖర్ గారు నిన్న అనగా 29 వ తారికున రాజీవ్ గాంధీ విమానశ్రయం కు రావడం జరిగింది.ఈ సందర్భమును పురస్కరించుకొని రాష్ట్ర నలుమూలల నుండి బహుజన్ సమాజ్ పార్టీ శ్రేణులు వేలాది గా తరలి వచి 500 పై చిలుకు కార్లతో దాదాపు 5 వేల మంది కార్య కర్తల తో ర్యాలీ గా వచ్చి రాష్ట్ర కార్యాలయం లో నేషనల్ కోఆర్డినేటర్, సెంట్రల్ స్టేట్ కోఆర్డినేటర్, స్టేట్ కోఆర్డినేటర్ లా ఆధ్వర్యం లో బాధ్యతలు స్వీకరించడం జరిగింది.ఈ సందర్భంగా డోర్నకల్ నియోజక వర్గం నుండి మహబూబాబాద్ జిల్లా మాజీ జిల్లా ఇంచార్జి విజయ్ కాంత్, జిల్లా జనరల్ సెక్రటరీ ఎడ్ల శ్రీను, మరియు డోర్నకల్ నియోజ్క వర్గ ఇంచార్జి పార్వతి రమేష్ నాయక్ ఆధ్వర్యం లో నియోజ్క వర్గ కార్యకర్తలు అధ్యక్షుల వారికి మరియు నూతన రథ సారధులకు శుభాకాంక్షలు తెలపడం జరిగింది.ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు ఇబ్రామ్ శేఖర్ డోర్నకల్ లో 2023 శాసన సభ ఎన్నికల్లో బీజేపీ కంటే మనకు ఎక్కువ ఓట్లు వచ్చాయి అని గుర్తు చేస్తూ ఈ సారి ఇంకా బాగా కష్టపడాలి అని రాష్ట్ర అధ్యక్షులు గా అలాగే రాష్ట్ర కమిటీ తరుపున పూర్తి సహకారం ఉంటుంది అని , రాబోయే రోజులలో డోర్నకల్ నియోజక వర్గం మహిళా నియోజక వర్గం అయ్యే అవకాశం ఉంది అని తెలయ చేశారు, అంతకు ముందు మీడియా సమావేశం లో నూతన అధ్యక్షులు ఇబ్రామ్ శేఖర్ తెలంగాణ లో బహుజన రాజ్యం స్థాపన కు మీరు ఇలాగే కష్టపడాలి అని, ఉత్తరప్రదేశ్ తరువాత ఆంధ్రప్రదేశ్ లో రాజ్యాధికారం రావాలి అని కలలు కన్న కాన్షీరామ్ కలను మన నాయకురాలు బహెన్ కుమారి మాయావతి నాయకత్వం లో సహకారం చేసుకుందాము అని తెలియ చేశారు,అలాగే ఈ ఉద్యమం తప్ప ఏ ఉద్యమము మన బహుజనుల తల రాతలను మార్చదు అని కేవలం బాబా సాహెబ్ అంబేద్కర్ ఇచిన ఓటు తో కాన్షీరామ్ చెప్పిన విధముగా వారి పని విధానంలో ఓట్లు మావి సీట్లు మీవా ఇక పై చెల్లదు ఇక పై చెల్లదు అనే నినాదం తో మనం ముందుకు సాగాలి అని చెప్పడము జరిగింది.ఈ సందర్భంగా ప్రతి ఊరి నుండి కేవలం 5 మంది బహుజన ఉద్యమ శ్రేయోభిలాషులను గుర్తించి వారికి ఉద్యమ కొరకు కావలసిన విషయంగా ఎడ్యుకేట్ చేసి, వారిని ఉద్యమం కొరకు, మన ప్రజల కొరకు సంఘర్షించే విధముగా తయారు చేసి వారిని వ్యవస్థీకరించి ఉద్యమాన్నీ బలోపేతం చేయాలి అని తెలియ చేశారు.తప్పకుండా 2028 లో బహుజన రాజ్యమును తెలంగాణ లో వస్తుంది అని హామీ ఇచ్చారు,ఈ కార్యక్రమం లో మరిపెడ మండల సెక్రటరీ నితిన్ నాయక్,మరిపెడ మండల ఇ సీ సభ్యులు రామ రావు తదితరులు పాల్గొన్నారు.