మాజీ ఎమ్మెల్యే రెడ్యానాయక్, నవీన్ రావు ఆశీస్సులతో
మాజీ ఎంపీ సీతారాం నాయక్.
మహబూబాబాద్ జిల్లా తెలుగు గళం.
దేశ ప్రధాని నరేంద్ర మోడీ హవా దేశంలో కొనసాగుతుందని మాజీ ఎంపీ సీతారాం నాయక్ అన్నారు. మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలంలోని బీచ్ రాజ్ పల్లి గ్రామపంచాయతీ బిజెపి పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా జరుపుల ఝాన్సీ సురేష్ నాయక్ నామినేషన్ దాఖలు చేశారు.ముఖ్యఅతిథిగా మాజీ ఎంపీ అజ్మీరా సీతారాం నాయక్ పాల్గొని విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో మారుమూల గిరిజన తండాలు అభివృద్ధి చెందడానికి బిజెపి కేంద్ర ప్రభుత్వమే నిధులను విడుదల చేసిందన్నారు.దేశ ప్రధాని నరేంద్ర మోడీ గ్రామాల అభివృద్ధిని కొనసాగిస్తూనే,మరోవైపు దేశ రక్షణ ను కాపాడడంలో ముందుంటున్నారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి చెందడానికి 60 నుండి 70 శాతం నిధులను నేరుగా కేంద్ర ప్రభుత్వం గ్రామపంచాయతీ అకౌంట్లో జమ చేసిందన్నారు.గ్రామీణ ప్రాంతాలలో కూడా బిజెపి పార్టీకి ఓట్ల శాతం పెరిగిందని,బిజెపి కోసం పనిచేసే నాయకులు,కార్యకర్తలు ఉన్నారన్నారు.తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వెనుకబడిన బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని మాటలు చెప్పి ఈరోజు దానికి 16 శాతానికి చేసిందన్నారు. బీసీలను అన్యాయం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి స్థానిక ఎన్నికలలో ఓట్లతో బుద్ధి చెప్పాలన్నారు.8 మంది అగ్రవర్ణాల మంత్రులు తమ మంత్రి పదవులను రాజీనామా చేసి బీసీలకు ఇవ్వాలని కోరారు.దేవులపై ఓట్లు పెట్టి తెలంగాణ రాష్ట్ర ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తుందన్నారు.డోర్నకల్ నియోజకవర్గంలో బిజెపి పార్టీ నుండి స్థానిక సంస్థలలో చాలా చోట్లలో గెలుపు పొందుతుందని తమ ధీమాను వ్యక్తం చేశారు.రానున్న అసెంబ్లీ ఎన్నికలలో తెలంగాణ రాష్ట్రంలో బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని డబుల్ ఇంజన్ సర్కారు నడుస్తుందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో బిజెపి ప్రభుత్వం హావా నడుస్తుందని అన్నారు.ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు గాదె రాంబాబు,జిల్లా ప్రధాన కార్యదర్శి గడ్డం అశోక్,బీజేపీ నాయకులు గుగులోత్ శంకర్ నాయక్,మండల అధ్యక్షులు గంగాధర్,బుల్లెట్ కృష్ణ,భాస్కర్,భూక్యా సుధాకర్ నాయక్,బీజేపీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.