
E69 న్యూస్ జనగామ/జఫర్ఘడ్
ఈ నెల 30న,హైదరాబాద్‌లోని ఇంద్రా పార్క్ వద్ద రుద్రమదేవి సెల్ఫ్ డిఫెన్స్ అకాడమీ ఆధ్వర్యంలో బెల్ట్ గ్రేడింగ్ పరీక్షలు నిర్వహించబడ్డాయి.ఈ కార్యక్రమంలో జనగామ జిల్లా జఫర్ఘడ్ మండలం తమ్మడపల్లి జి గ్రామానికి చెందిన రాపర్తి సాత్విక్ బ్రౌన్ బెల్ట్ సాధించి,ఫౌండర్ రవి చేతుల మీదుగా ప్రశంస పత్రం అందుకున్నాడు.గత మూడు సంవత్సరాలుగా డివైఎస్వీ ఆధ్వర్యంలో ఉచిత కరాటే శిక్షణ శిబిరాన్ని సాత్విక్ వినియోగించుకొని ఈ విజయాన్ని సాధించాడు.ఈ సందర్భంగా రుద్రమదేవి సెల్ఫ్ డిఫెన్స్ అకాడమీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అన్నెపు రాజేంద్రం,విద్యార్థులు,విద్యార్థినులు పాల్గొన్నారు.జనగామ జిల్లా క్రీడా అధికారి వెంకట్ రెడ్డి,ఉచిత శిక్షణ శిబిరాన్ని వినియోగించి ఉత్తమ ఫలితాలను సాధించిన సాత్విక్‌ను అభినందించారు.ఎంజేబీసీ పెంబర్తి పాఠశాల ప్రధానోపాధ్యాయుడు,ఉపాధ్యాయులు,హౌస్ మాస్టర్ శైలజ,తల్లిదండ్రులు సాత్విక్‌కు శుభాకాంక్షలు తెలిపారు.