భద్రాచలం గిరిజన బాలికల బి.ఎడ్ కళాశాల కు నూతన ప్రిన్సిపల్
భద్రాచలం పట్టణంలోని బీఈడీ కళాశాలలో ప్రిన్సిపల్ గా పనిచేయుచున్న వీరు నాయక్ ను పరిపాలన సౌలభ్యం దృష్ట్యా తన విధుల నుండి సోమవారం నాడు రిలీవ్ చేసి మాతృ సంస్థకు పంపించడం జరిగిందని ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ అన్నారు. ప్రస్తుతం బీఈడీ కళాశాల ప్రిన్సిపాల్ గా డీఈడీ కళాశాల ప్రిన్సిపాల్ భవానీకి పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించడం జరిగిందని ఆయన అన్నారు.