భూపాలపల్లిలో ఏ టు జెడ్ మెడికల్ షాపును ప్రారంభించిన ఎమ్మెల్యే జీఎస్సార్
తెలుగు గళం న్యూస్ జయశంకర్ భూపాలపల్లి
ఈరోజు(శుక్రవారం) భూపాలపల్లి పట్టణంలోని పాత జంగేడు రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన ఏ టు జెడ్ మెడికల్ మెడికల్ షాపు ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు హాజరై ప్రారంభించారు.ముందుగా ఎమ్మెల్యేకు షాపు నిర్వాహకులు పూల బొకే అందించి స్వాగతం పలికారు.షాపును ప్రారంభించిన అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ భూపాలపల్లి ప్రాంత ప్రజలకు నాణ్యమైన ఔషధాలు,వైద్య అవసరాలన్నీ ఒకేచోట లభించే విధంగా ఏ టు జెడ్ మెడికల్ షాపు ను ప్రారంభించడం ఆనందకరమని ఎమ్మెల్యే అన్నారు.ప్రజలకు మెరుగైన ఆరోగ్య సేవలు అందించడమే లక్ష్యంగా పనిచేయాలని నిర్వాహకులకు ఎమ్మెల్యే సూచించారు.అనంతరం దుకాణ యజమానులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలియజేస్తూ,ప్రజలకు 24 గంటలు అందుబాటులో ఉండే మెడికల్ సేవలను అందిస్తామన్నారు.అనంతరం నిర్వాహకులకు ఎమ్మెల్యే శాలువాలు కప్పి అభినందించారు.ఎంచుకున్న రంగంలో దినదినాభివృద్ధి చెందాలని ఎమ్మెల్యే కోరుకున్నారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట పలువురు పట్టణ నాయకులు,కార్యకర్తలు,అభిమానులు ఉన్నారు.