
మటువాడ పోలీస్ స్టేషన్ ఎదుట చలివేంద్రం,మజ్జిగ కేంద్రం ప్రారంభం
ఈ69న్యూస్ వరంగల్:-వేసవికాలంలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు మటువాడ పోలీసులు ప్రజల సహకారంతో చలివేంద్రం మరియు మజ్జిగ కేంద్రాన్ని మటువాడ పోలీస్ స్టేషన్ ఎదుట ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమాన్ని వరంగల్ ఏసీబీ శ్రీ నందిరాం నాయక్ ప్రారంభించారు.ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మటువాడ పోలీస్ ఇన్స్పెక్టర్ తుమ్మ గోపి,ఎస్ఐ విటల్ మరియు పలువురు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.ప్రస్తుత ఉష్ణోగ్రతల దృష్ట్యా,ఈ కార్యక్రమం ప్రజలందరికి మేలు చేయగలదని వారు తెలిపారు.