
వెలిశాల క్రిష్ణమాచారి యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు
_ వెలిశాల క్రిష్ణమాచారి యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు
మధ్యాహ్న భోజన పథకం కార్మికులు తమ న్యాయమైన డిమాండ్ల సాధనకు హైదారాబాద్ కమీషనర్ కార్యాలయ ఎదుట ధర్నా కార్యక్రమానికి వెళుతున్న క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా పోలీసుల అక్రమ అరెస్టులు, లో భాగంగా కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్, సిర్పూర్ ఉ ,లింగాపూర్ మండలాల నుండీ ఛలో హైదరాబాద్ కు వెళుతుంటే. పోలీసుల అడ్డుకొని అక్రమ అరెస్టులు చేసినతీరు కాంగ్రెస్ పార్టీ కి గులాంగిరీ చేస్తున్నట్లు స్పష్టంగానే అర్థం అవుతుందని అన్నారు. న్యాయ పోరాటానికి వెళుతున్న వారికి , తగు సూచనలు సలహాలు ఇవ్వకుండా అడ్డుకొని బెదిరించి వెనక్కి పంపడం ఈ ప్రభుత్వంలోనే చూస్తున్నామని. గత ప్రభుత్వంలో ఎన్నడూ ఎదురుకోలేదని, ఇదిసరైంది కాదని. మండిపడ్డారు. అరెస్టు చేసిన వారిని వెంటనే రిలీజ్ చేయాలనీ లేని పక్షంలో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.