అక్రమ కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకుంటాం-ఎస్సై జానీపాష

ధర్మసాగర్ (ఈ69న్యూస్),ఆగస్టు 19
హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం మలకపల్లి గ్రామంలో నిషేధిత గుట్కా అమ్మకాలు జరుగుతున్నాయన్న పక్కా సమాచారం పోలీసులకు అందింది.వెంటనే ధర్మసాగర్ ఎస్ఐ జానీ పాషా సిబ్బందితో కలిసి గ్రామంలో దాడి నిర్వహించారు.ఈ దాడిలో సుమారు రూ.24 వేల విలువైన అంబర్ గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు.ఈ సందర్భంగా ఎస్ఐ జానీ పాషా మాట్లాడుతూ..ప్రభుత్వ నిబంధనల ప్రకారం గుట్కా విక్రయం,వినియోగం పూర్తిగా నిషేధించబడిందని,అయినప్పటికీ కొంతమంది లాభాల కోసం ఇలాంటి వ్యాపారం చేస్తున్నారని హెచ్చరించారు.ఇలాంటి అక్రమ కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.దాడిలో కానిస్టేబుళ్లు రాము,బిక్షపతి,కుమారస్వామి పాల్గొని గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసి సాక్ష్యాలతో పాటు కేసు నమోదు చేశారు.గ్రామంలో అక్రమ వ్యాపారాలపై నిరంతరంగా పర్యవేక్షణ కొనసాగిస్తామని పోలీసులు వెల్లడించారు.