మహేష్ కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి కొండా సురేఖ,ఎమ్మెల్యే కేఆర్
వర్ధన్నపేట నియోజకవర్గం 14వ డివిజన్ మాజీ అధ్యక్షుడు, సోషల్ మీడియా ఇంచార్జీ అడప మహేష్ ఇటీవల పెట్రోల్ దాడిలో మరణించిన నేపథ్యంలో రాష్ట్ర అటవీ, పర్యావరణ,దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ,వర్ధన్నపేట శాసనసభ్యులు,విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు మహేష్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. మహేష్ పార్టీకి చేసిన సేవలను గుర్తు చేసుకుంటూ ఆ కుటుంబానికి భరోసా ఇచ్చారు.నిరుపేద కుటుంబానికి చెందిన మహేష్ కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని మంత్రి కొండా సురేఖ తెలిపారు.నిందితులను వెంటనే పట్టుకొని కఠినమైన శిక్ష విధించాలని అధికారులను ఆదేశించినట్లు చెప్పారు.ఈ కార్యక్రమంలో వరంగల్ జిల్లా అధ్యక్షుడు మహమ్మద్ ఆయుబ్,డివిజన్ ముఖ్య నాయకులు,నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు