మాజీ ఎమ్మెల్యేల ప్రచారం
వరంగల్ జిల్లా:వర్దన్నపేట మండలం కడారి గూడెం గ్రామంలో పంచాయతీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మాజీ ఎమ్మెల్యేలు వన్నాల శ్రీరాములు డాక్టర్ టీ. రాజేశ్వరరావు కొండేటి శ్రీధర్ బిజెపి సర్పంచ్ అభ్యర్థి కుందూరు లలితా మహేందర్రెడ్డి, ని గెలిపించాలని ఓటర్లను కోరారు. కేంద్ర ప్రభుత్వ నిధులు గ్రామాభివృద్ధికి ఉపయోగపడతాయని తెలిపారు గ్రామ సమస్యలపై పోరాడుతున్న కుందూరు లలితా మహేందర్ రెడ్డిని గెలిపించాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో గ్రామస్తులు బిజెపి కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.