ఐసిడిఎస్ సూపర్వైజర్ సంధ్యారాణి.
ఐసిడిఎస్ సూపర్వైజర్ సంధ్యారాణి.
ఖమ్మం/ చింతకాని,జూలై 30(తెలుగుగళం) న్యూస్: మానవ అక్రమ రవాణాను అరికడదాం మహిళలు, పిల్లలను రక్షిద్దాం అని ఐ సి డి ఎస్ చింతకాని సెక్టార్ సూపర్వైజర్ సంధ్యారాణి అన్నారు. చింతకాని మండల పరిధిలోని నేరడ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో హెడ్మాస్టర్ రాయల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం ప్రోగ్రాంలో సంధ్యారాణి మాట్లాడుతూ అపరిచిత వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలని నమ్మి మోసపోకూడదని అన్నారు. బాల్య వివాహాలు, బాల కార్మికులను గుర్తించినట్లయితే హెల్ప్ లైన్ కు1098, మహిళల హక్కులకు భంగం కలిగినట్లయితే 181 కి, అత్యవసర పరిస్థితి ఏర్పడితే 122కు, పోలీస్ శాఖ సేవలు అవసరమైతే 100కు, సైబర్ క్రైమ్ బాధితులు 1930 హెల్ప్ లైన్ కు ఆలస్యం చేయకుండా వెంటనే ఫోన్ చేసి రక్షణ పొందాలని సూచించారు. అంగనవాడి టీచర్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన విసిపిసి కమిటీలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఉప సర్పంచ్ కోట ముత్తయ్య మాట్లాడుతూ ప్రజా ప్రతినిధులుగా గ్రామంలో ప్రజలకు ఎటువంటి సమస్యలు వచ్చినా మా దృష్టికి తీసుకువస్తే పరిష్కారాన్ని కృషి చేస్తామన్నారు. ప్రభుత్వ పాఠశాల రాయల శ్రీనివాసరావు మాట్లాడుతూ గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించి ప్రజలను చైతన్య పరచాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు సరోజిని, వెంకమ్మ , విద్యార్థినీ, విద్యార్థులు పాల్గొన్నారు.