రాష్ట్ర ప్రభుత్వానికి మున్సిపల్ కార్మికుల హెచ్చరిక
15 రోజుల్లోగా సమస్యలపై చర్చలు జరిపి మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలి. లేకుంటే సమ్మె తప్పదు.
– రాష్ట్ర ప్రభుత్వానికి మున్సిపల్ కార్మికుల హెచ్చరిక
తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ Ê ఎంప్లాయీస్ యూనియన్ (సిఐటియు) రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా ఈరోజు (తేది: 26`07`2025)న కమీషనర్ Ê డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రధాన కార్యాలయం వద్ద యూనియన్ రాష్ట్ర కార్యదర్శి పి. సుధాకర్ అధ్యక్షతన ధర్నా జరిగింది. ఈ ధర్నా కార్యక్రమానికి మున్సిపల్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు మరియు సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్, యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జనగాం రాజమల్లు, సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్వీ. రమ, రాష్ట్ర కమిటీ సభ్యులు వై. సోమన్న, యూనియన్ రాష్ట్ర ఆఫీస్ బేరర్స్ వి. నాగమణి, డి. కిషన్, ఎర్రా నర్సింహులు, ఎ. వెంకటేష్, సావణపల్లి వెంకటస్వామి, కిల్లె గోపాల్, వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు.
పాలడుగు భాస్కర్ మాట్లాడుతూ రాష్ట్రంలో మున్సిపల్ ఉన్నతాధికారుల మాటలను, ప్రభుత్వం ఇచ్చిన జీఓలను, సర్క్యులర్లను క్రింది అధికారులు లెక్క చేయకుండా తమ ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ కార్మికులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని, 60 సం॥లు పైబడిన వారు మరియు మరణించిన కార్మికుల స్థానంలో ఎలాంటి షరతులు లేకుండా వారి కుటుంబ సభ్యులకు పని కల్పించాలని, అనేక డిపార్ట్మెంట్లలో పిఆర్సి ఆధారంగా ఇచ్చిన జీఓలను అమలు చేస్తూ వేతనాలు చెల్లిస్తున్నారని, మున్సిపల్ డిపార్ట్మెంట్లో మాత్రమే అందుకు విరుద్ధంగా ప్రత్యేక జీఓలను జారీ చేసి వేతనాలను తగ్గిస్తున్నారని, ఈ పద్ధతి మారాలని అన్నారు. కేటగిరీల వారీగా మున్సిపల్ కార్మికులకు వేతనాలు చెల్లించాలని, రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించబోయే 2వ పిఆర్సిలో కనీస వేతనం రూ.26,000/`లుగా నిర్ణయించి అమలు చేయాలని, పిఆర్సిలో జీతాలు పెంచితే ఎప్పుడు జీఓ వస్తే అప్పటినుండే పెరిగిన వేతనాలు చెల్లించాలనాన్నరు. మున్సిపల్ కార్మికులందరినీ పర్మినెంట్ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అనేక మున్సిపాల్టీలలో అభివృద్ధి పేరుతో అవార్డులు ` రివార్డులను అందుకుంటూ కేంద్ర ప్రభుత్వం నుండి ఫండ్ తెస్తున్నారు. తెచ్చిన ఫండ్‌లో కార్మికులకు మాత్రం వాటా ఇవ్వకుండా వెట్టి చాకిరి చేయిస్తున్నారు. అనేక కార్పొరేషన్లలో హార్టికల్చర్, హరితహారం లాంటి విభాగాలలో కార్మికులను నియమించి మున్సిపల్ కార్మికులకు చెల్లిస్తున్న వేతనాలను ఇవ్వడం లేదు. వీరికి తక్షణమే వేతనాలు పెంచాలి. రాష్ట్రంలో వర్షాల తీవ్రత పెరిగినందున తక్షణమే కార్మికులందరికీ రెయిన్ కోట్లు, ఇతర పనిముట్లను అందించాలని, స్వచ్ఛ ఆటో కార్మికులకు ఇండ్లను అప్పగించి వారి బాధ్యత నుండి ప్రభుత్వం తప్పుకుంటుందని, వారి వేతనాలు కార్పొరేషనే చెల్లించాలని, అవసరమైతే ప్రాపర్టీ ట్యాక్స్‌లను పెంచి వసూలు చేసైనా వారి జీతాలు ఇవ్వాలని, మున్సిపల్ కార్మికులు ఉదయం 5`00 గంటలకే పనికి రావాలని ఒత్తిడి చేస్తున్నారని, ఇకనుండి ఈ పద్ధతి చెల్లదని, ఒక్కపూట పని మాత్రమే చేస్తామని, ఈ సమస్యలను ప్రభుత్వం 15 రోజుల లోగా పరిష్కరించకుంటే గత ప్రభుత్వ హయాంలో 44 రోజుల సమ్మెతో ఏవిధంగానైతే సమస్యలను పరిష్కరించుకున్నామో రేవంత్‌రెడ్డి ప్రభుత్వానికి మున్సిపల్ కార్మికుల సమ్మె సెగ తప్పదని హెచ్చరించారు.
ఈ ధర్నా సందర్భంగా మున్సిపల్ డిప్యూటీ డైరెక్టర్ భువనగిరి శ్రీనివాస్ గారికి రాష్ట్ర కమిటీ బృందం సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని ఇవ్వగా వారు కార్మికులను ఉద్దేశించి మాట్లాడుతూ తమ పరిధిలోని సమస్యలను తక్షణమే పరిష్కరిస్తామని, ఇతర సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి పరిష్కారానికి కృషి చేస్తానని హామీనిచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా వేలాదిమంది కార్మికులు భారీ వర్షాలను కూడా లెక్కచేయకుండా ఈ ధర్నా కార్యక్రమానికి హాజరై విజయవంతం చేశారు.