ఈ69న్యూస్ జయశంకర్ భూపాలపల్లి రేగొండ

జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండల కేంద్రానికి చెందిన తడక శ్రీకాంత్ రమ్య ల కూతురు దక్షిణ్య గౌడ్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందింది. కాగా శుక్రవారం చిన్నారి దక్షిణ్య గౌడ్ తల్లిదండ్రులు ఆమె జ్ఞాపకార్థం పలు పరికరాలను స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని మండల కేంద్రంలోని ఒకటవ అంగన్వాడీ కేంద్రంకి బహుకరించారు. ఒకటవ అంగన్వాడి టీచర్ మాడగాని సుజాతకు చిన్నారి తల్లిదండ్రులు రమ్య శ్రీకాంత్ లు పది కుర్చీలు, పది ప్లేట్స్, పది గ్లాసులను అందజేశారు.ఈ కార్యక్రమంలో గ్రామస్తులు,చిన్నారుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.