మృతుని కుటుంబాన్ని పరామర్శించిన బీజేపీ జిల్లా అధ్యక్షులు నిషిధర్ రెడ్డి
మృతుని కుటుంబాన్ని పరామర్శించిన బీజేపీ జిల్లా అధ్యక్షులు నిషిధర్ రెడ్డి
తెలుగు గళం న్యూస్ భూపాలపల్లి మొగుళ్ళపల్లి
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం రంగాపురం గ్రామానికి చెందిన భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులు మూత రాకేష్ ఇటీవల మృతి చెందగా, ఆయన పార్థివ దేహానికి బీజేపీ జిల్లా అధ్యక్షులు ఏడునూతుల నిషిధర్ రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా అంతిమయాత్రలో పాల్గొన్న నిషిధర్ రెడ్డి, మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.కుటుంబానికి బీజేపీ పార్టీ తరఫున అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.నిషిధర్ రెడ్డితో పాటు జిల్లా ఉపాధ్యక్షులు మోరే రవీందర్ రెడ్డి, బీజేవైఎం జిల్లా అధ్యక్షులు సయ్యద్ గాలిఫ్, మండల ఉపాధ్యక్షులు కిషన్ రావు, బూత్ అధ్యక్షులు తక్కెళ్లపల్లి విజేందర్ రావు, నాయకులు రాజేశ్వరరావు, తుముల సురేష్, సోషల్ మీడియా కన్వీనర్ ఎర్ర రాకేష్ రెడ్డి తదితర బీజేపీ నాయకులు పాల్గొన్నారు.