మే డే వేడుకల్లో కాంగ్రెస్ నేతల హామీ
వరంగల్ జిల్లా:పర్వతగిరి మండల కేంద్రంలో హమాలీ సంఘం, భవన నిర్మాణ సంఘం, ఆటో యూనియన్ ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్జాతీయ కార్మిక దినోత్సవ వేడుకల్లో జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు పిన్నింటి అనిల్ రావు, మండల కాంగ్రెస్ అధ్యక్షులు జాటోత్ శ్రీనివాస్ నాయక్, పర్వతగిరి సర్పంచ్ చిదురు శంకర్ పాల్గొని కార్మికులకు శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా పిన్నింటి అనిల్ రావు మాట్లాడుతూ… “ప్రపంచానికి వెన్నెముకగా నిలిచిన శ్రామిక లోకానికి, నా తోటి కార్మిక సోదరులకు మే డే శుభాకాంక్షలు. నేడు మనం అనుభవిస్తున్న 8 గంటల పని విధానం, సౌకర్యవంతమైన పని వాతావరణం వెనుక ఎంతోమంది కార్మికుల త్యాగాలు, పోరాటాలు ఉన్నాయి” అన్నారు.మండల కాంగ్రెస్ అధ్యక్షులు జాటోత్ శ్రీనివాస్ నాయక్ మాట్లాడుతూ…”1886లో అమెరికాలోని చికాగోలో కార్మికులు ‘8 గంటల పని, 8 గంటల విశ్రాంతి, 8 గంటల వినోదం’ నినాదంతో చేసిన చారిత్రక పోరాట ఫలితమే నేడు కార్మికులకు దక్కిన గుర్తింపు. భవనాలు నిర్మించే శ్రామికుల నుండి దేశానికి అన్నం పెట్టే రైతు వరకు ప్రతి ఒక్కరి చెమట చుక్కల వల్లే నాగరికత అభివృద్ధి చెందింది” అని పేర్కొన్నారు.కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో, ఎమ్మెల్యే కె.ఆర్. నాగరాజు సారధ్యంలో కార్మికులకు సామాజిక భద్రత, తగిన వేతనం, ఆరోగ్యం, కుటుంబ భద్రతకు భరోసా కల్పిస్తామని, కార్మికుల సంక్షేమానికి మరింత కృషి చేస్తామని హామీ ఇచ్చారు.సర్పంచ్ చిదురు శంకర్ మాట్లాడుతూ…”ఈ మే డే సందర్భంగా కార్మికులందరూ తమ హక్కుల పట్ల చైతన్యవంతులు కావాలి. శ్రామికుల కష్టానికి తగిన ప్రతిఫలం దక్కినప్పుడే దేశం నిజమైన అభివృద్ధి సాధిస్తుంది. జై శ్రామిక శక్తి! జై హింద్!” అన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షులు కుసం రామచందర్,ఉప సర్పంచ్ చింతకుంట్ల అనిత రమేష్, మాజీ ఏఎంసీ డైరెక్టర్ పిన్నింటి సునీల్ రావు, ఎస్సీ సెల్ కన్వీనర్ నరకుడు రవీందర్, గ్రామ పార్టీ ఉపాధ్యక్షులు చనమాల నరసయ్య, సీనియర్ నాయకులు వర్ధినేని పాపారావు, నరెడ్ల సూరయ్య,గడ్డం బాబు,చింతపట్ల అజయ్,కార్మిక సంఘం నాయకులు జిల్లా ధర్మయ్య, రావుల రాజు, గొల్ల వీరస్వామి, కార్మికులు తదితరులు పాల్గొన్నారు.