మే20న దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయండి– వరంగల్ కార్మిక సంఘాల పిలుపు
ఈ69 న్యూస్:-వరంగల్ జిల్లా ఆల్ ట్రేడ్ యూనియన్ల ఆధ్వర్యంలో మే 20న జరుగనున్న దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని రాజా శ్రీ గార్డెన్లో జరిగిన జిల్లా సదస్సులో నాయకులు పిలుపునిచ్చారు.సీఐటీయూ,ఏఐటీయూ,ఐఎఫ్టీయూ,బిఆర్టీయూ నాయకులు కేంద్ర బీజేపీ ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను తప్పుపడుతూ,నాలుగు లేబర్ కోడ్ల రద్దు,కార్మిక హక్కుల పరిరక్షణ కోసం పోరాటం కొనసాగించాలని సూచించారు.ఉపాధి,ధరలు,ఆరోగ్య సమస్యలపై ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతోందని విమర్శించారు.అన్ని రంగాల కార్మికులు,ఉద్యోగులు మే 20 సమ్మెను విజయవంతం చేయాలని వారు కోరారు.వివిధ కార్మిక సంఘాల నాయకులు,సభ్యులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.