మొంథా తుఫాన్ వల్ల నష్టపోయిన రైతన్నలకు భరోసా
వరంగల్ జిల్లా:పర్వతగిరి మండల పరిధిలోని సోమారం వర్ధన్నపేట మండల పరిధిలోని ఇల్లంద, కట్ర్యాల గ్రామాల్లో తుఫాన్ ధాటికి ఇండ్లు, పంటలు నష్టం వాటిల్లిన పొలాలను నేడు క్షేత్రస్థాయిలో వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు పరిశీలించారు.ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల ప్రకటించిన ఎకరాకు ₹10,000 ఆర్థిక సహాయం నష్టపోయిన ప్రతి రైతుకు అందేలా చూస్తానని ఆయన హామీ ఇచ్చారు.అధికారులు పారదర్శకంగా పనిచేసి ప్రతి రైతుకు పరిహారం అందేలా చూడాలని కోరారు.
సి యం రేవంత్ రెడ్డి ప్రకటించిన ఎకరాకు 10,000 ఆర్థిక సహాయాన్ని ఎమ్మెల్యేపునరుద్ఘాటించారు.వెంటనే నష్టపోయిన రైతులు ,కౌలు రైతులకు కూడా పరిహారం అమలు అవుతుందని ఎవ్వరు అధైర్య పడొద్దని నియోజకవర్గ ప్రజలకు హామీ ఇచ్చారు.ఈ ఆర్థిక సహాయం వరి, పత్తి పంటల రైతులకు తక్షణ ఉపశమనం కలిగిస్తుందని తెలిపారు.మరియు 56,54 వ డివిజన్ ప్రజలను తుఫాన్ కోలుకోలేని దెబ్బకొట్టిదని గుర్తు చేసుకున్నారు. నిన్న సీఎం రేవంత్ రెడ్డి హెలికాప్టర్ ద్వారా ఏరియల్ సర్వే చేసి నష్టపోయిన ప్రతి ఒక్కరినీ ఆదుకుంటామని హామీ ఇచ్చారని తెలిపారు.క్షేత్రస్థాయిలో సమస్యలను అర్థం చేసుకుంటేనే ప్రభుత్వ సహాయం సమర్థవంతంగా అందించడానికి అవకాశం ఉంటుందని ఎమ్మెల్యే కె.ఆర్ నాగరాజు అన్నారు.అందుకోసమని సీఎం రేవంత్ రెడ్డి వరద బాధితులను పరామర్శించేందుకు వస్తే సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న మెదడు లేని నాయకుడు కాంగ్రెస్ అసమర్థ పాలన అని అంటున్నారని వారికి కొంచమైన సిగ్గుండాలని ప్రకృతి విలయాన్ని ఎవ్వరు ఆపలేరని వారు అర్ధం చేసుకోవాలని అన్నారు.గత ప్రభుత్వం లా మాటలు ఇచ్చి తప్పించుకునే ప్రభుత్వం మాది కాదని చేతల ప్రభుత్వం కాబట్టే తక్షణమే సహాయం ప్రకటించి నష్టపోయిన ప్రతి ఇంటిని ప్రతి ఒక్క కుటుంబాన్ని, రైతులు,కౌలు రైతులకు సైతం ఆదుకుంటామని తెలిపారు.సిగ్గులేని నాయకులు ప్రకృతి విలయాన్ని కూడా రాజకీయం చేయాలనుకోవడం సిగ్గుమాలిన పని అని హెచ్డీదేవ చేశారు.ఈ కార్యక్రమంలో వర్ధన్నపేట ఏఎంసీ చైర్మన్ నరుకుడు వెంకటయ్య, ఐనవోలు ఆలయ కమిటీ చైర్మన్ కమ్మగోని ప్రభాకర్ గౌడ్, వరంగల్ జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షుడు బొంపల్లి దేవేందర్రావు, జిల్లా ఉపాధ్యక్షుడు పిన్నింటి అనిల్ రావు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు అబిడి రాజిరెడ్డి, మండల అధ్యక్షులు ఎద్దు సత్యనారాయణ, జాటోతు శ్రీనివాస్ నాయక్, పోశాల వెంకన్న గౌడ్ సీనియర్ నాయకులు కార్యకర్తలు మరియు వ్యవసాయ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.