
ఈ69 న్యూస్, పామిడి.
- విద్యార్థి దశ నుంచి మొక్కలు నాటడం అలవర్చుకోవాలి
- పామిడి నలంద పాఠశాలలో విద్యార్థులకు మొక్కలు పంపిణీ చేసిన పూజారి లక్ష్మి దేవి
ఈ69 న్యూస్, పామిడి.
విద్యార్థి దశ నుంచి మొక్కల నాటడం అలవర్చుకొని, పచ్చదనాన్ని పెంచి పర్యావరణాన్ని కాపాడుకోవాలని బిజెపి నాయకురాలు పూజారి లక్ష్మీదేవి పిలుపునిచ్చారు. ఆమె బుధవారం పామిడిలోని నలంద పాఠశాలలో విద్యార్థులకు మొక్కలు పంపిణీ చేశారు. ఆమె విద్యార్థులతో కలిసి పాఠశాల ఆవరణంలో మొక్కలను నాటి నీరు పోశారు. నలంద పాఠశాల విద్యార్థులకు మొక్కలు విశిష్టత వాటి ప్రాముఖ్యతను గురించి తెలియజేశారు. పెరుగుతున్నటువంటి వాతావరణ సమతుల్య పరిస్థితులు కనుగుణంగా చెట్లను పెంచి కాలుష్యాన్ని నివారించుకోవాలని పేర్కొన్నారు. విద్యార్థులు చెట్లు పెంచడం నీరును కాపాడుకోవడం వృధా చేయకుండా ఉండడం ప్లాస్టిక్ ని వాడకుండా నిషేధించడం వంటి వాటిపై చిన్ననాటి నుండి అవగాహన పెంచుకొని భావి భారత పౌరులుగా మెలగాలన్నారు. మొక్కలు నాటడంతో పాటు వాటిని పెంచడం కూడా బాధ్యతగా తీసుకోవాలని పూజారి లక్ష్మి దేవి ఈ సందర్భంగా విద్యార్థులకు సూచించారు.