మౌలిక వసతులతో తండా రూపురేఖలు మార్పు
మూలమర్రి తండా గ్రామ అభివృద్ధి నా లక్ష్యం అని బుధవారం ఏర్పాటు చేసిన గ్రామ సభలో గ్రామ సర్పంచ్ భూక్య జానకి రాములు నాయక్ అన్నారు,తండా లో మౌలిక వసతుల కల్పన ధ్యేయంగా తండా రూపురేఖలు మారుస్తామని తెలిపారు, మురికి కాల్వలో చేత్త తొలగింపు,పారిశుధ్యం లోపం లేకుండా చూడాలని ప్రతి రోజు వివిధ కాలనీ లో మురికి కాల్వల ను తియ్యడం జరుగుతుందన్నారు.మౌళిక సదుపాయాల కల్పన నీటి సమస్యను గుర్తించి బోర్లను మరమ్మతు పనులు చేపిస్తామన్నారు,రాబోయే వేసకాలంలో గ్రామపంచాయతీ పరిధిలో కాలనీ లో వేసవిలో నీటి కొరతత్తో ఇబ్బందులకు గురి కాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం కోసం గ్రామ సభ లో చర్చించడం జరిగిందన్నారు. గ్రామ ప్రజల మౌలిక వసతులు కల్పించడం వాటి పరిష్కరించడమే తన ముందున్న లక్ష్యమన తెలిపారు. ప్రజల అవసరాలు తీర్చడమే నా ముందున్న మొదటి కర్తవ్యం గా భావించి గ్రామ అభివృద్ధిలో అనునిత్యం శ్రమిస్తూ ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండి వారి సమస్యలు పరిష్కరించడమే జరుగుతుందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో వెంకన్న నాయక్, నెహ్రు నాయక్, భారత్ కుమార్, గ్రామ నాయకులు, గ్రామ పంచాయతీ కార్యదర్శి ప్రణయ్,గ్రామ పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.