రాంనగర్ గ్రామం నుండి బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థి బరిలో
ఇంటింటి ప్రచారానికి శ్రీకారం–అభివృద్ధి కోసం బ్యాట్ గుర్తుకు ఓటు వేయాలని ప్రజలకు విజ్ఞప్తి హనుమకొండ జిల్లా అయినవోలు మండలం రాంనగర్ గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన ఈడ స్వరూప సుధాకర్ సర్పంచ్ అభ్యర్థిగా బరిలో దిగారు.ఈ సందర్భంగా వారు గ్రామంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించి ఇంటింటి ప్రచారాన్ని ప్రారంభించారు.ప్రజలను ప్రత్యక్షంగా కలుసుకుంటూ,గత పది సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు,అభివృద్ధి కార్యక్రమాలను స్వరూప సుధాకర్ వివరించారు.గ్రామ ప్రజలు బ్యాట్ గుర్తుకు తమ ఓటును వేయి,అధిక మెజార్టీతో తనను గెలిపించాలని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ..“గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉపసర్పంచిగా పనిచేస్తున్న సమయంలో గ్రామ అభివృద్ధికి నేను అన్ని విధాలుగా కృషి చేశాను.మాజీ సర్పంచ్ ఆధ్వర్యంలో పనిచేసిన అనుభవంతో గ్రామ సమస్యలన్నింటిపై నాకు పూర్తి అవగాహన ఉంది.ఇంకా గ్రామంలో సిసి రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ, విద్యుత్ స్తంభాలు వంటి కొన్ని మౌలిక వసతుల పనులు మిగిలి ఉన్నాయి.ప్రజలు నన్ను ఆశీర్వదిస్తే, రాంనగర్ను పూర్తిస్థాయి అభివృద్ధి గ్రామంగా తీర్చిదిద్దేందుకు నా వంతు కృషి చేస్తాను” అని తెలిపారు.