
తెలంగాణలో మావోయిస్టుల లొంగింపులు కొనసాగుతున్నాయి.తాజాగా మరో ఇద్దరు మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయారు.రాష్ట్ర కమిటీ సభ్యురాలు కాకరాల సునీత అలియాస్ బద్రి (మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు సుధాకర్ భార్య),చెన్నూరు ప్రాంతానికి చెందిన హరీష్ అలియాస్ శ్రీను రాచకొండ పోలీసు కమిషనర్ సుధీర్ బాబు ఎదుట లొంగిపోయారు.ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ..ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు,మావోయిస్టులకు ఇచ్చే ప్రోత్సాహక పథకాలే లొంగింపులకు ప్రధాన కారణమని పేర్కొన్నారు.శాంతి,అభివృద్ధి దిశగా ముందుకు సాగేందుకు లొంగిపోవాలని మిగతా మావోయిస్టులకు పిలుపునిచ్చారు.