రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా రాపర్తి రాజు ఎన్నిక
తెలంగాణ గ్రామ పంచాయతి ఎంప్లాయిస్ & వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) రాష్ట్ర 5వ మహాసభలు మండల కేంద్రంలో 24,25 తేదీలలో విజయవంతంగా నిర్వహించబడ్డాయి.ఈ మహాసభల్లో నూతన రాష్ట్ర కమిటీని ఎన్నుకున్నారు.రాష్ట్ర కమిటీలో జనగామ జిల్లాకు మూడు పదవులు లభించడం విశేషం.రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా రాపర్తి రాజు,రాష్ట్ర కమిటీ సభ్యులుగా బస్వ రామచంద్రం,నారోజు రామచంద్రం ఎన్నికయ్యారు.ఈ సందర్భంగా రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన రాపర్తి రాజు మాట్లాడుతూ..“తెలంగాణలో 52,000 మంది గ్రామ పంచాయతి కార్మికులు గత ఎన్నో సంవత్సరాలుగా సమస్యలు ఎదుర్కొంటున్నా సరైన పరిష్కారం లభించలేదు.మల్టీ పర్పస్ వర్కర్ విధానాన్ని రద్దు చేయడం,నెలకి కనీసం ₹26,000 వేతనం కల్పించడం,ఉద్యోగ భద్రతను అమలు చేయడం వంటి ముఖ్య డిమాండ్లను మహాసభల్లో విస్తృతంగా చర్చించాం.వీటి సాధనకు సమగ్ర కార్యాచరణ రూపొందించాం”అన్నారు.జనగామ జిల్లాలో గ్రామ పంచాయతి కార్మికుల హక్కుల కోసం పోరాటాన్ని మరింత బలపరుస్తామని హామీ ఇచ్చారు.