రాష్ట్ర బడ్జెట్ లో కోత పెట్టి దళితులకు తీరని అన్యాయంరాష్ట్ర బడ్జెట్ లో కోత పెట్టి దళితులకు తీరని అన్యాయం
- చేవెళ్ల ఎస్సీ డిక్లరేషన్ అమలు ఊసే లేదు*
- బడ్జెట్లో దళిత సంక్షేమానికి భారీ కోతలు*
- కెవిపిఎస్ ఆధ్వర్యంలో ఖమ్మంలో రాష్ట్ర బడ్జెట్ ప్రతుల దగ్ధం*
- బడ్జెట్ లో దళితులకు నిధులు పెంచాలి*
- కెవిపిఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు నందిపాటి మనోహర్ డిమాండ్
- దళితుల సంక్షేమానికి చేవెళ్ల ఎస్సీ డిక్లరేషన్ ద్వారా అభివృద్ధి పథం చూపిస్తామని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం, ప్రస్తుతం ఆ హామీలను పూర్తిగా విస్మరించి దళితులను మోసం చేసిందని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు నందిపాటి మనోహర్ తీవ్రంగా విమర్శించారు. శనివారం స్థానిక ఎన్నెస్పీ క్యాంప్ గేట్ ఎదురుగా కెవిపిఎస్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర బడ్జెట్ ప్రతులను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా కెవిపిఎస్ జిల్లా అధ్యక్షులు ముత్తమాల ప్రసాద్ అధ్యక్షతన జరిగిన నిరసన కార్యక్రమంలో మనోహర్ మాట్లాడుతూ గత బడ్జెట్లో ఎస్సీ సంక్షేమానికి రూ.40,232 కోట్లు కేటాయించగా, ఈసారి కేవలం రూ.11,784 కోట్లు మాత్రమే కేటాయించడం తీవ్రమైన అన్యాయమన్నారు. ఇది సుమారు 70 శాతం కోతగా నిలిచిందని తెలిపారు. దళితుల అభివృద్ధి పేరుతో మాటలు మాత్రమే చెప్పి, ఆచరణలో మాత్రం ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని వారు అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం‘దళిత బంధు’ పేరుతో రూ.10 లక్షలు ఇస్తామని ప్రకటించి పూర్తిగా అమలు చేయలేకపోయిందని గుర్తుచేశారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం‘అంబేద్కర్ ఓవర్సీస్’ పథకం ద్వారా రూ.12 లక్షలు ఇస్తామని ప్రకటించినప్పటికీ, బడ్జెట్లో ఒక్క రూపాయి కూడా కేటాయించకపోవడం దారుణమన్నారు. దళితుల ఓట్లతో అధికారంలోకి వచ్చి, ఇప్పుడు వారి సంక్షేమాన్ని పక్కన పెట్టడం బాధాకరమని, దళితుల అభివృద్ధి పట్ల ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని స్పష్టమవుతోందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే బడ్జెట్ను సవరించి కనీసం రూ.50,000 కోట్లు ఎస్సీ సంక్షేమానికి కేటాయించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున జరిగే ఆందోళనలకు ప్రభుత్వమే బాధ్యత వహించవలసి వస్తుందని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కెవిపిఎస్ జిల్లా అధ్యక్షులు ముత్తమాల ప్రసాద్, జిల్లా ఉపాధ్యక్షులు పాపిట్ల సత్యనారాయణ, నకరికంటి చిరంజీవి, కెవిపిఎస్ టూ టౌన్ అధ్య