కామారెడ్డి జిల్లా లింగంపేట మండల కేంద్రంలో 6-5-2023 శనివారం తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి జిల్లా ఉపధ్యక్షుడు అనిల్ కుమార్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశానికి రాష్ట్ర అధ్యక్షుడు గోపి రజక హాజరై మాట్లాడుతూ రానున్న సాధారణ ఎలక్షన్స్ లో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు రజకులకు ఐదు అసెంబ్లీ సీట్లు కేటాయించాలని వారన్నారు.తెలంగాణ రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీల ఆఫీసుల్లో తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి రాష్ట్ర కమిటీ మెమోరండం కూడా ఇవ్వడం జరిగింది కావున వాటిని పరిశీలించి మీమీ పార్టీలలో పనిచేసే రజక కార్యకర్తలకు సీట్లు కేటాయించాలని కోరారు.తెలుగుదేశం పార్టీ తెలంగాణలో రజకులకు సీట్లు కేటాయిస్తామని హామీ ఇచ్చినట్లే మిగతా రాజకీయ పార్టీలు కూడా అసెంబ్లీ సీట్లు ఇవ్వాలని వారు కోరారు లేనియెడల అన్ని నియోజకవర్గాలలో స్వతంత్ర అభ్యర్థులను పోటీలో ఉంచి మా ఓట్లు మేమే వేసుకుంటామని మా సత్తా ఏంటో చాటుతామని వారు అన్నారు
జిల్లా అధ్యక్షులు మచ్చర్ల శ్రీకాంత్ జువ్వాడి మాట్లాడుతూ… తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో అనేక రైతాంగ పోరాటాలు చేసిన చాకలి ఐలమ్మ గారిని తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే గుర్టిస్తం అని ప్రగల్బలు పలికిన KCR స్వరాష్ట్రం తెలంగాణా సాధించుకున్న తర్వాత చాకలి ఐలమ్మ ను గుర్తించక పోవడాన్ని మేము తీవ్రంగా కండిస్తున్నం రాష్త్ర ప్రభుత్వము ఇక నైనా స్పందించి ట్యాంక్ బండ్ పై చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నాం
ఈ సమావేశానికి జిల్లా కార్యదర్శి బుర్రిగారి సాయిలు, బాయికడి నవీన్,దమ్మి అరవింద్,రాజయ్య,రమేష్ తదితరులు పాల్గొన్నారు