రుద్రారం గ్రామంలో జరిపిన సమావేశం
తెలుగు గళం న్యూస్ జయశంకర్ భూపాలపల్లి మల్హర్రావు
రుద్రారం గ్రామంలో జరిపిన సమావేశంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ (టిఆర్పి) సర్పంచ్ అభ్యర్థిగా రోడ్డ వంశీని పార్టీ జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ అధికారికంగా ప్రకటించారు. అనంతరం నాయకులు సాగర్ సమక్షంలో నామినేషన్ పత్రాలు అభ్యర్థికి అందజేశారు.
ఈ సందర్భంగా టిఆర్పి జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ మాట్లాడుతూ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల అభివృద్ధి కోసం టిఆర్పి పార్టీ కట్టుబడి పనిచేస్తుందని, యువతకు ప్రాధాన్యత ఇచ్చే పార్టీగా టిఆర్పి గుర్తింపు తెచ్చుకుందని తెలిపారు. బిఆర్ఎస్, కాంగ్రెస్, బిజెపి పార్టీల్లో ధన బలం కలిగిన వ్యక్తులకు టికెట్లు ఇస్తున్నారని విమర్శించారు.
రోడ్డ వంశీ నిజాయితీగల, చదువుకున్న యువ నాయకుడు అని పేర్కొన్న రవి పటేల్, గ్రామ సమస్యలపై పూర్తి అవగాహనతో పనిచేస్తున్న వంశీ విజయం రుద్రారం గ్రామ అభివృద్ధికి దోహదం చేస్తుందని అన్నారు. ప్రజలు ఆయనకు సంపూర్ణ మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.అలాగే పార్టీ ముఖ్య ఎజెండా గురించి మాట్లాడుతూ—పేద, బడుగు, బలహీన వర్గాల విద్య–వైద్యం, మంచి పాలన, భూమిలేని నిరుపేదలకు ఎకరా ఎకరాల భూముల కేటాయింపు తన పార్టీ ప్రధాన లక్ష్యాలు అని తెలిపారు. ఈ సంకల్పం కార్యరూపం దాల్చడానికి టిఆర్పి అభ్యర్థులను ప్రజలు విజయం దిశగా నడిపించాలని కోరారు.ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు సోమల చంద్రశేఖర్, గట్టు శ్రీకాంత్, ఓ. కోపేల శ్రీధర్, పసుల సాయి తదితరులు పాల్గొన్నారు.