
ఈ69 న్యూస్: ధర్మసాగర్ మండలం రాంపూర్ గజ్జలబండలో జరిగిన చోరీ కేసును ధర్మసాగర్ పోలీసులు కేవలం రెండు రోజుల్లో చేధించారు. ఏప్రిల్ 23న బానోత్ శంకర్ ఇంట్లో చోరీ జరిగినట్టు ఫిర్యాదు కాగా, పోలీసులు దర్యాప్తు ప్రారంభించి ఇద్దరు నిందితులను పట్టుకున్నారు.వారు విలాసవంతమైన జీవితానికి అలవాటు పడి, ద్విచక్ర వాహనాలకు తప్పుడు నంబర్లతో ఒంటరిగా ఉన్న ఇళ్లలో చోరీలు చేస్తున్నట్లు విచారణలో వెలుగులోకి వచ్చింది. నిందితులపై గతంలో కూడా కేయూసీ, సుబేదారి, మడికొండ పోలీస్ స్టేషన్లలో పలు కేసులు ఉన్నట్లు గుర్తించారు.