

నిందితుడు నుండి రెండు బైక్ లతో పాటు 75 వేల రూపాయలు స్వాధీనం
ఈ69న్యూస్ జయశంకర్ భూపాలపల్లి రేగొండ
జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ పోలీసులు బాగిర్తిపేట క్రాస్ రోడ్ వద్ద నిర్వహించిన వాహన తనిఖీల సందర్భంగా చర్లపల్లి శివ (వయస్సు: 20 సం., తండ్రి: వెంకన్న, కులం: ఎరుకల, వృత్తి: కూలీ, గ్రామం: కాంటాయపాలెం, తొర్రూర్ మండలం, మహబూబాబాద్ జిల్లా, ప్రస్తుత నివాసం: కర్కపల్లి, ఘనపూర్ మండలం, భూపాలపల్లి జిల్లా)ని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు దొంగిలించిన బైక్ (AP 20 AG 0250) తో పట్టుబడ్డాడు. విచారణలో, నిందితుడు తన భార్య తమ్ముడు శివరాత్రి లింగబాబుతో కలిసి గత కొంతకాలంగా రేగొండ, నెల్లికుదురు, లింగాల, దమ్మనపేట మరియు ఇతర పరిసర మండలాల్లో కాపర్ వైర్లు, ట్రాన్స్ఫార్మర్లు మరియు మోటార్ల దొంగతనాలకు పాల్పడినట్లు పోలీసుల సమక్షంలో ఒప్పుకున్నాడు.నిందితుడు తన వద్ద ఉన్న విద్యుత్ పరిజ్ఞానాన్ని ఉపయోగించి,రాత్రి సమయాల్లో ట్రాన్స్ఫార్మర్లు మరియు కాపర్ వైర్లు ఉన్న ప్రాంతాలను గుర్తించి,వాటిని కత్తిరించి దొంగిలించేవాడు. నిందితుడు దొంగిలించిన వివరాలను పోలీసులు విలేకరులకు వివరించారు.
దొంగతనం వివరాలు:
1.మార్చి 2025, దమ్మనపేట గ్రామం: నిందితుడు మరియు శివరాత్రి లింగబాబు రాత్రి సమయంలో దమ్మనపేట గ్రామ శివారులోని ఒక BT ప్లాంట్ వద్ద జనరేటర్ కేబుల్ కాపర్ వైర్లను కత్తిరించి దొంగిలించారు.
2.ఫిబ్రవరి 2025, భగీరథిపేట గ్రామం: నిందితుడు ఒక్కడే రాత్రి సమయంలో ఒక వ్యవసాయ భూమిలోని మోటారు కరెంటు తీగలను కత్తిరించి, మోటారును దొంగిలించాడు.
3.జులై 2025, లింగాల గ్రామం: నిందితుడు దొంగిలించిన బైక్ (AP 36 P 7951)లో లింగాల గ్రామ శివారులోని ఒక ట్రాన్స్ఫార్మర్ వైర్లను కత్తిరించి, దొంగిలించాడు.
4.మే 2025, రావిరాల గ్రామం: నిందితుడు రాత్రి 12 గంటల సమయంలో నెల్లికుదురు మండలంలోని రావిరాల గ్రామ శివారులో రెండు ట్రాన్స్ఫార్మర్ల నుండి కాపర్ వైర్లను దొంగిలించాడు.
5.బైక్ దొంగతనాలు:నిందితుడు జులై 2025లో గోవిందరాజుల గుట్ట, వరంగల్ వద్ద బైక్ (AP 36 P 7951) మరియు ఆగస్టు 2025లో సారపాక గ్రామంలో, కొత్తగూడెం లో బైక్ (AP 20 AG 0250)ని దొంగిలించినట్లు ఒప్పుకున్నాడు.
పోలీసులు నిందితుడి వద్ద నుండి రూ.75,000/- నగదు, రెండు దొంగిలించిన బైక్లు (AP 20 AG 0250, AP 36 P 7951), మరియు 5 కిలోల కాపర్ వైర్ ను బాగిర్తిపేట అడవిలో దాచిన స్థలం నుండి స్వాధీనం చేసుకున్నారు.ఈ కార్యక్రమంలో సిఐ కరుణాకర్ రావు,రేగొండ ఎస్ఐ సందీప్ కుమార్,రేగొండ పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.