
ఈ69న్యూస్ జనగామ ఆగస్ట్ 4
జనగామ జిల్లాలోని రైతులకు నిరంతరాయంగా 24 గంటల ఉచిత విద్యుత్‌ను సరఫరా చేయాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్యా చందు నాయక్ డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ బాషా షేక్ కు వినతి పత్రం అందజేశారు.గతంలో మాదిరిగా రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు,అలాగే ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకు విద్యుత్ సరఫరా కొనసాగించాలని,మెసేజ్ ఆధారంగా కరెంటు ఇవ్వడం రైతులను తీవ్రంగా ఇబ్బంది పెట్టుతోందని ఆయన విమర్శించారు.అలాగే,గ్రామీణ ప్రాంతాల్లో వేల సంఖ్యలో విద్యుత్ స్తంభాలు,తీగలు ప్రమాదకరంగా వేలాడుతున్నాయని వాటిని వెంటనే మరమ్మతులు చేయాలని,రైతులు,పశువులు ప్రమాదాల నుండి రక్షించబడాలన్నారు.ఈ కార్యక్రమంలో పట్టణ కార్యదర్శి మంగ భీరయ్య,రైతు సంఘం నాయకులు కందుల వెంకన్న,బాల్దే అంజయ్య తదితరులు పాల్గొన్నారు.