లక్ష్య సాధనకు నిరంతర కృషి అవసరం: కలెక్టర్ సత్య శారద
ఈ69న్యూస్:- వరంగల్ జిల్లా రాయపర్తి మండలం కొం డూరు జడ్పీ హై స్కూల్ వార్షికోత్సవంలో జిల్లా కలెక్టర్ సత్య శారద పాల్గొని, విద్యార్థులు చిన్నప్పటి నుంచే స్పష్టమైన లక్ష్యంతో ముందుకు సాగాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని వసతులు, నిపుణులైన ఉపాధ్యాయులు ఉన్నారని తెలిపారు. పీఎం శ్రీ ద్వారా విద్యార్థులకు అనుభవజ్ఞానం కల్పిస్తున్నామన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడిఓ కిషన్, హెచ్ఎం పద్మాలత తదితరులు పాల్గొన్నారు