
వరంగల్ నగరం లో నకిలీ బంగారం ముఠాల హల్ చల్
వ్యాపారస్తులు,ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
ఈ69న్యూస్:- నకిలీ బంగారం ముఠాలపై మటువాడ పోలీసుల హెచ్చరిక జారీ చేశారు.వరంగల్ నగరంలో నకిలీ బంగారం ముఠాలు చురుకుగా తిరుగుతున్నాయని మటువాడ ఇన్స్పెక్టర్ టి.గోపి తెలిపారు.బంగారు షాపులు,వ్యాపారుల వద్దకు వెళ్లి “బంగారం దొరికింది”అంటూ మోసపూరితంగా నగదు వసూలు చేస్తున్నారు.ప్రజలు,వ్యాపారులు అప్రమత్తంగా ఉండాలని,అనుమానాస్పద వ్యక్తులు వస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని సూచించారు.సంప్రదించవలసిన నెంబర్లు:ఇన్స్పెక్టర్ గోపి–87126 85117,హరికాంత్–98660 96386,అలీ–91772 01592