
ఈ69న్యూస్ వరంగల్
వరంగల్ తూర్పు నియోజకవర్గంలో అకాల వర్షాల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో,బిజెపి రాష్ట్ర నాయకులు,వరంగల్ అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ ఎర్రబెల్లి ప్రదీప్ రావు మంగళవారం వరద బాధితులను ప్రత్యక్షంగా పరామర్శించారు.ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.ఏళ్ల తరబడి ఓరుగల్లు ప్రజలు ఈ అకాల వర్షాలతో అతలాకుతలం కావాల్సిందేనా? ఆనాడు కెసిఆర్ ప్రభుత్వం గానీ,నేడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం గానీ వరంగల్‌ను పట్టించుకోవడం లేదు.రాష్ట్రానికి రెండో రాజధానిగా ఉన్న ఈ నగరాన్ని పూర్తిగా విస్మరించారు.తమ స్వస్థలాల అభివృద్ధికే కట్టుబడి,వరంగల్‌పై మాత్రం సవతి ప్రేమ చూపుతున్నారు,”అని విమర్శించారు.కాంగ్రెస్ నాయకుల నిర్లక్ష్యం,ప్రభుత్వ యంత్రాంగం ముందస్తు చర్యలు తీసుకోవడంలో విఫలమవడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని అన్నారు.2024–25 ఆర్థిక సంవత్సరానికి SDRF ఖాతాలో ₹1,345.15 కోట్లు ఉండగా,ఇప్పటికే కేంద్రం నుంచి ₹416.80 కోట్లు,రాష్ట్రం నుంచి ₹138.40 కోట్లు అందాయని,ఈ నిధులతో విద్యుత్ పునరుద్ధరణ,రోడ్ల మరమ్మతులు,వరద నియంత్రణ పనులు చేయాల్సి ఉన్నప్పటికీ,ప్రభుత్వం వాటిని సక్రమంగా వినియోగించలేదని ఆరోపించారు.ప్రజల కష్టాల కంటే మీ పర్యటనలు ముఖ్యమా? పేద ప్రజలు వరదల్లో ఇబ్బందులు పడుతుంటే,మీరు రెడ్ కార్పెట్ పైన నడవడం సిగ్గుచేటు.ఇందుకోసమేనా ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నది? అని ఎర్రబెల్లి ప్రదీప్ రావు ప్రశ్నించారు.