
ఈ69న్యూస్ వరంగల్
వరంగల్ నగర బస్టాండ్ నిర్మాణాన్ని తక్షణమే పూర్తి చేయాలని సిపిఐయు నగర కమిటీ డిమాండ్ చేసింది.ఎం.సి.పి.యు ఆధ్వర్యంలో బస్టాండ్ నిర్మాణ స్థితిని పరిశీలించిన సందర్భంగా జిల్లా కార్యదర్శి పెద్దరపు రమేష్,నగర కార్యదర్శి మాలోతు సాగర్ ముఖ్య అతిథులుగా పాల్గొని వివరాలు వెల్లడించారు.అగ్ర నాయకులు మాట్లాడుతూ…గత ప్రభుత్వం రూ.75 కోట్ల వ్యయంతో ఐదు అంతస్తులు,32 ప్లాట్‌ఫార్ములు,వ్యాపార సముదాయాలు,మెట్రో రైల్‌కు అనుకూలంగా మోడరన్ బస్టాండ్ నిర్మాణం ప్రారంభించింది.అయితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఉన్న బస్టాండ్‌ను కూల్చివేసి రెండు సంవత్సరాలు గడిచినా ఇప్పటి వరకు పనులు ముందుకు సాగకుండా నిలిచిపోయాయి అన్నారు.రోజుకు దాదాపు రెండు లక్షల మంది ప్రయాణికులు వరంగల్ బస్సుల ద్వారా వచ్చి తమ పనులు ముగించుకుని వెళ్తున్నారని,తాత్కాలిక బస్టాండ్‌లో బస్సుల కోసం గంటల తరబడి నిలబడే పరిస్థితి ఏర్పడిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.నీవారిగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రయాణికుల,కార్మికుల కోసం ఆగిపోయిన నిర్మాణ పనులను తక్షణమే ప్రారంభించి పూర్తి చేయాలని కోరారు.రైల్వే స్టేషన్ రోడ్డులో రద్దీ అధికంగా ఉన్న నేపథ్యంలో వ్యాపారులు రోడ్డుపైకి వచ్చిన తట్లతో అనేక ఇబ్బందులు ఎదురవుతుండటానికీ ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు.వెంటనే నిర్మాణ పనులు పునఃప్రారంభించకపోతే ఉద్యమాన్ని తీవ్రమయ్యేలా చేస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో నర్రా ప్రతాప్,సుంచు జగదీశ్వర్,ముక్కెర రామస్వామి,మాలోతు ప్రత్యూష,ఎగ్గని మల్లికార్జున్,ఐతథం నాగేష్,పరిమళ గోవర్ధన్ రాజ్,రాయి నేనీ ఐలయ్య, అడుప యాదగిరి,ఎం.డి.మహబూబ్ పాషా,గణపాక ఓదేల్ తదితరులు పాల్గొన్నారు.