
warangal news citu news telugu news
ఈ69న్యూస్ వరంగల్: దేశవ్యాప్తంగా ఆల్ ట్రేడ్ యూనియన్స్ పిలుపు మేరకు బుధవారం నిర్వహించిన సార్వత్రిక సమ్మెకు తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టిడబ్ల్యూజేఎఫ్) వరంగల్ జిల్లా కమిటీ సంఘీభావం తెలిపింది.జిల్లా అధ్యక్షుడు జక్కుల విజయకుమార్ అధ్యక్షతన ఫెడరేషన్ సభ్యులు వరంగల్ రైల్వే స్టేషన్ నుంచి వామపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ప్రారంభమైన మహా ర్యాలీలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా జక్కుల విజయకుమార్ మాట్లాడుతూ..కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలు కల్లబొల్లి పాలిటి.నాలుగు లేబర్ కోడ్ల రూపంలో తీసుకొచ్చిన చట్టాలు కార్మిక హక్కులను,జర్నలిస్టుల హక్కులను తీవ్రంగా ఖండిస్తున్నాయి.కార్మికులను బానిసత్వంలోకి నెట్టే ఈ చట్టాలను వెంటనే ఉపసంహరించుకోవాలి అని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి బొట్ల స్వామి దాస్,ఉపాధ్యక్షులు వెల్ది రాజేందర్,సహాయ కార్యదర్శి భావండ్లపల్లి కిరణ్ కుమార్,రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు పాలడుగుల సురేందర్,సభ్యులు సాదిక్ పాషా,పెండెల శ్రీనివాస్,వారణాసి మోహన్ తదితరులు పాల్గొన్నారు.