
ఈ69న్యూస్:- వరంగల్:మట్వాడా పోలీస్ స్టేషన్ పరిధిలో అనుమతి లేకుండా ప్రమాదకరమైన స్టెరాయిడ్స్ ను విక్రయిస్తున్న కేసులో జిమ్ ట్రైనర్ కందగట్ల శ్రావణ్ కుమార్ అలియాస్ కిరణ్ (34) ను పోలీసులు అరెస్ట్ చేశారు.శ్రావణ్ గత ఐదు సంవత్సరాలుగా ఆన్లైన్లో స్టెరాయిడ్స్ కొనుగోలు చేసి,వాటిని యువతకు వేగంగా శరీర ఆకృతులు మారుతాయని నమ్మించి విక్రయిస్తున్నట్టు తెలుస్తోంది. అతని ఇంట్లో నుంచి వందల సంఖ్యలో టాబ్లెట్లు,ఇంజక్షన్లు స్వాధీనం చేసుకున్నారు.ఈ కేసులో మరో ముగ్గురు నిందితులు ప్రశాంత్,మణికంఠ,ఆనంద్లపై కూడా విచారణ సాగుతోంది.