ఆర్జీ తండా గ్రామంలో చిన్నారి మృతితో అలుముకున్న విషాదం
ఆర్జీ తండా గ్రామంలో చిన్నారి మృతితో అలుముకున్న విషాదం
తెలుగు గళం న్యూస్ జయశంకర్ భూపాలపల్లి రేగొండ
జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం ఆర్జీ తండా గ్రామంలో ఇంట్లో ఉన్న ఎయిర్ కూలర్ వైరు తగిలి ఓ చిన్నారి మృతి చెందింది.గ్రామానికి చెందిన బానోతు వీరు ప్రియాంకల కూతురు అంజలి (3) ఇంట్లో ఉన్న కూలర్ వైరు ఒకటి కరెంటు బోర్డులో ఒకటి కిందపడి ఉండడంతో ఆడుకుంటూ వెళ్లి ముట్టుకుంది.ఇంట్లో ఎవరు లేకపోవడంతో చిన్నారి విద్యుత్ షాక్ కు గురై అక్కడికక్కడే మృతి చెందింది.నిరుపేద కుటుంబానికి చెందిన చిన్నారి మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.రేగొండ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తును ప్రారంభించారు