సర్పంచ్ ఉప సర్పంచ్ లను సన్మానించిన తహశీల్దార్, ఎంపీడీవో
తల్లాడ నూతన సర్పంచ్ గా బాధ్యతలు చేపట్టిన పెరిక నాగేశ్వరరావు(చిన్నబ్బాయి), ఉప సర్పంచ్ కర్నాటి లక్ష్మారెడ్డి తల్లాడ అధికారులను సన్మానించారు. గురువారం తహశీల్దార్ కరుణాకర్ రెడ్డి, ఎంపీడీవో సురేష్ బాబులను కలిసి శాలువాలతో సన్మానించి సత్కరించారు. ఈ సందర్భంగా వారు నూతన ప్రజాప్రతినిధులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు కొద్దిసేపు చర్చించుకున్నారు. ఈ కార్యక్రమంలో వారి వెంట ఎండి బాబు, అయ్యప్ప ఉన్నారు.