
సుప్రీంకోర్టు జడ్జిపై దాడి
ఖిలా వరంగల్ మండలం రంగశాయిపేట జంక్షన్ వద్ద కెవిపిఎస్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయ్‌పై దాడి ప్రయత్నాన్ని ఖండిస్తూ నిరసన కార్యక్రమం జరిగింది.ఈ సందర్భంగా కెవిపిఎస్ రాష్ట్ర కమిటీ సభ్యుడు ఉసిల్ల కుమార్ మాట్లాడుతూ..ప్రధాన న్యాయమూర్తిపై షూ విసరడం హేయమైన చర్య అని,ఇది కేవలం వ్యక్తిపై దాడి మాత్రమే కాకుండా రాజ్యాంగంపై దాడి అని పేర్కొన్నారు.మతోన్మాది రాకేష్ కుమార్‌పై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని,అతడిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.ఈ ఘటన వెనుక ఉన్న సంఘ్ పరివార్ శక్తులు దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని కోరారు.ఉసిల్ల కుమార్ మాట్లాడుతూ..షెడ్యూల్ కులానికి చెందిన మేధావి న్యాయపీఠంపై కూర్చోవడం కొంతమంది మతోన్మాదులకు జీర్ణం కావడం లేదు. సనాతన ధర్మం పేరుతో రాజ్యాంగ ధర్మాన్ని దెబ్బతీయాలనుకుంటున్నారు.లౌకిక,ప్రజాస్వామిక,రాజ్యాంగ స్పూర్తిని కాపాడాలి”అన్నారు.ఈ కార్యక్రమంలో కెవిపిఎస్ జిల్లా సహాయ కార్యదర్శి ఆవుల ఉదయ్ కుమార్,జిల్లా ఉపాధ్యక్షురాలు ఇనుముల ఎలిషా,నాయకులు నరకుటి బాబు,బన్న కృష్ణ,రాజేష్ తదితరులు పాల్గొన్నారు