
స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో నిర్వహించనున్న శ్రీ సంత్ సేవా లాల్ మహరాజ్ జయంతి వేడుకల ఏర్పాట్లపై అధికార యంత్రాంగం సమీక్ష సమావేశం నిర్వహించింది.ఈరోజు ఘనపూర్ స్టేషన్ రెవెన్యూ డివిజనల్ అధికారి డి.ఎస్. వెంకన్న, జిల్లా గిరిజనాభివృద్ధి అధికారి ఆర్. ప్రేమలతతో కలిసి నియోజకవర్గ పరిధిలోని అన్ని మండలాల తహశీల్దార్లు మరియు బంజారా కమిటీ సభ్యులతో సమావేశమయ్యారు.ఫిబ్రవరి 24, 2026న ఘనపూర్ స్టేషన్లోని పద్మావతి గార్డెన్లో నిర్వహించనున్న నియోజకవర్గ స్థాయి సంత్ సేవా లాల్ మహరాజ్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించేలా అవసరమైన అన్ని ఏర్పాట్లను సమన్వయం చేసి, కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు.వేదిక, భద్రత, పారిశుధ్యం, తాగునీరు, పార్కింగ్ తదితర అంశాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని పేర్కొన్నారు.ఈ సమావేశంలో జిల్లా సహాయ గిరిజనాభివృద్ధి అధికారిణి హసీనా బేగం, ట్రైనీ జిల్లా పంచాయతీ అధికారి ఎ. నవీన్, తహశీల్దార్లు వెంకటేశ్వర్లు, రవీందర్, సదానందం, విజయ్ కుమార్, కోమి మరియు బంజారా కమిటీ సభ్యులు భిక్షపతి నాయక్, స్వామి నాయక్, కొమురెల్లి నాయక్, హుస్సేన్ నాయక్, శంకర్ నాయక్, మొగిళి నాయక్, ప్రకాష్ నాయక్, క్రిష్ణ నాయక్ తదితరులు పాల్గొన్నారు.జయంతి వేడుకలను సమిష్టిగా విజయవంతం చేయాలని అధికారులు, కమిటీ సభ్యులు నిర్ణయించారు.