
citu లో అంగన్వాడీ లు చేరికలు - పి జయలక్ష్మి
citu లో అంగన్వాడీ లు చేరికలు – పి జయలక్ష్మి
అంగన్వాడీ హక్కుల సాధన కోసం అందరూ కలసికట్టుగా ఐక్యంగా ఉద్యమిద్దామని తెలంగాణ అంగన్వాడీ టీచర్స్&హెల్పర్ల్స్ యూనియన్ (సీఐటీయూ) తెలంగాణా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి జయలక్ష్మి పిలుపునిచ్చారు.బుధవారం రోజున పాలకుర్తి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశానికి md మైముదా అధ్యక్షత వహించగా ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాలను బలహీన పరచడం కోసమే పిఎం శ్రీ పథకం కేంద్ర ప్రభుత్వం తీసుకవచ్చిందని క్రమక్రమంగా అంగన్వాడీ కేంద్రాలను రద్దు చేసే కుట్రలో భాగమే ఈ పిఎం శ్రీ పథకం అన్నారు.ICDS వస్తున్న నిధులను దారిమళ్లించి పి ఎం శ్రీ కి ఖర్చు చేస్తున్నరన్నారు.GOనెంబర్ 14 ను వెంటనే రద్దు చెయ్యాలని వారు డిమాండ్ చేశారు. అంగన్వాడి కేంద్రాల ఖుషి ఫలితమే దేశంలో పౌష్టికాహార లోపం తగ్గుదల బాలింతల జబ్బుల నివారణ పోలో నివారణ వంటి విషయాల్లో దేశం అద్భుతమైన ప్రగతిని సాధిస్తుందన్నారు. గత 50 సంవత్సరాలుగా అంగన్వాడి కేంద్రాలు అశేషమైన కృషి ఫలితంగా 15 రకాల జబ్బులు నివారించడంలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది అన్నారు. అంగన్వాడి కేంద్రాలు బలహీన పరచడం వలన బలహీన వర్గాల ప్రజలకు తీవ్రమైన అన్యాయం జరుగుతుందన్నారు. అంగన్వాడి కేంద్రాల్లో ఇప్పటికే పూర్వ ప్రాథమిక విద్య కొనసాగిస్తున్నారని దీన్ని సమర్థవంతంగా నిర్వహించడానికి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి అంగన్వాడి కేంద్రాల్లో మెరుగైన వసతులు కల్పించాలని వారు కోరారు. నూతన విద్యా విధానం పేరుతోటి కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వినాశకర విధానాలు ఐసిడిఎస్‌ను ప్రజలకు దూరం చేస్తున్నాయని ఐసిడిఎస్ రక్షణ అంగన్వాడి కేంద్రాల బలోపేతం కోసం సిఐటియు నిరంతరం కృషి చేస్తుందన్నారు. అంగన్వాడి కేంద్రాల్లో ఒకే యాప్ ను అమలు చేయాలి మినీ టీచర్స్ కు పెండింగ్ లో ఉన్న 11 నెల వేతనం విడుదల చేయాలి పిఎఫ్ ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని వారు కోరారు. ఉద్యోగ భద్రత లేక అంగన్వాడి కేంద్రాల్లో అధికారుల వేధింపులు ప్రజాప్రతినిధుల వేధింపులు గ్రామస్థాయి రాజకీయ నాయకుల వేధింపులు రోజురోజుకు తీవ్రతరం అవుతున్నాయని ప్రభుత్వం అంగన్వాడి కేంద్రాల్లో నాణ్యమైన గుడ్లను మంజూరు చేయాలని వారు డిమాండ్ చేశారు. రిటైర్మెంట్ బెనిఫిట్ పెంచాలని వారు కోరారు. అంగన్వాడి కేంద్రాల్లో పక్కా భవనాలు మరుగుదొడ్ల సౌకర్యం బీరువాలు లేక రికార్డులు భద్రపరచుకోవడానికి అనేక ఇబ్బందులు కలుగుతున్నాయని బల్లాలు కుర్చీలు లేక ఇబ్బందులు పడుతున్నారని వాటిని వెంటనే ప్రభుత్వం మంజూరు చేయాలని వారు కోరారు. సెక్టార్ ప్రాజెక్టు పోషకాహార మీటింగులు బిఎల్ఓల డ్యూటీలు వల్ల అంగన్వాడి కేంద్రాల్లో ఉండలేక ఇబ్బందులు పడుతున్నారని కావున వారికి ఇతర పథకాలు సర్వే డ్యూటీలు వెయ్యొద్దన్నారు. అంగన్వాడి కేంద్రాలకు మే నెల సెలవులు ప్రకటించాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. అనంతరం కొడకండ్ల ప్రాజెక్టు పరిధిలో ఉన్న అంగన్వాడి టీచర్లు వివిధ యూనియన్ల నుండి 200 మంది అంగన్వాడీ టీచర్లు వెల్ఫేర్లు సిఐటియు లో చేరారు. ఈ కార్యక్రమంలో సిఐటియు రాష్ట్ర కమిటీ సభ్యులు యాటాల సోమన్న, జిల్లా అధ్యక్షులు రాపర్తి రాజు, జిల్లా కార్యదర్శి సుంచు విజేందర్, జిల్లా సహాయ కార్యదర్శి చిట్యాల సోమన్న, మహబూబాబాద్ ప్రాజెక్టు జిల్లా సహాయ కార్యదర్శి స్వరూప, సరిత, భాగ్య, బి శోభారాణి, మంగ, భారతి, ఇందిరా, యాదమ్మ, ఉప్ప లక్ష్మి, మాధవి, శోభ తో పాటు అంగన్వాడీలు ఆయాలు పాల్గొన్నారు.