
హిమ్మత్‌నగర్ హై స్కూల్లో ఉపాధ్యాయుల దాతృత్వం
జనగామ జిల్లా జఫర్ఘఢ్ మండలం ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు విద్యార్థుల కోసం చేస్తున్న సేవలు ఆదర్శనీయమని హిమ్మత్‌నగర్ మాజీ సర్పంచ్ తాటికాయల అశోక్ తెలిపారు.సోమవారం హిమ్మత్‌నగర్ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుల ఆర్థిక సహకారంతో ₹30,000 విలువైన వాటర్ ప్యూరిఫయర్‌ను ఏర్పాటు చేసి,తాటికాయల అశోక్,పాఠశాల అమ్మ ఆదర్శ కమిటీ చైర్పర్సన్ రాపర్తి రమ కలిసి ప్రారంభించారు.ఈ సందర్భంగా తాటికాయల అశోక్ మాట్లాడుతూ..“పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థుల దాహార్తి తీర్చేందుకు స్వచ్ఛందంగా ముప్పై వేల రూపాయల విలువైన ప్యూరిఫయర్ బహూకరించడం విశేషం.ఇది గ్రామానికి గర్వకారణం”అన్నారు.రాపర్తి రమ మాట్లాడుతూ..“తాను చైర్‌పర్సన్‌గా ఉన్న కాలంలో ఉపాధ్యాయులు ఇంత విలువైన సౌకర్యాన్ని సమకూర్చడం ఆనందదాయకం”అన్నారు.పాఠశాల ప్రధానోపాధ్యాయులు మంగు జయప్రకాశ్ మాట్లాడుతూ…“మా ఉపాధ్యాయులు బోధనలో మాత్రమే కాకుండా దాతృత్వంలో కూడా ముందు ఉంటారు.గంటకు 100 లీటర్ల నీటిని శుద్ధి చేసే ఈ ప్యూరిఫయర్ విద్యార్థులకు పెద్ద సహాయం కానుంది”అని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పసునూరి కవిత,కడారి వసంత,గాదె వెంకటస్వామి,వెంగల జితేందర్,దామెర ఉపేందర్,మోదుగ వనజాత,పొరిక మంజుల,భూక్యా వంశీకృష్ణ,దీకొండ మాధవి,మామూనూరి ప్రశాంత,పంచాయతీ కార్యదర్శి రాజశేఖర్,రాజు,ఫీల్డ్ అసిస్టెంట్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు