కోటి మంది ఆడపడుచులను కోటీశ్వరులు చేయడమే ప్రభుత్వ లక్ష్యం
వరంగల్ జిల్లా:కోటి మంది ఆడపడుచులను కోటీశ్వరులను చేయాలన్న ప్రభుత్వ సంకల్పం గొప్పదని ఏనుగల్లు సర్పంచ్ తొర్రి పద్మ-కుమార్ అన్నారు.ఏనుగల్లు గ్రామపంచాయతీ వద్ద నిర్వహించిన మహిళా గ్రామసభకు ఆమె ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.గ్రామస్థాయిలో మహిళలకు సాధికారత కల్పించాలని,ప్రతి రంగంలో మహిళలు ముందుండాలని సూచించారు.ప్రభుత్వ పథకాలు:
వడ్డీ లేని రుణాలు,ఉచిత బస్సు ప్రయాణం,పెట్రోల్ బంకులు,సోలార్ ప్లాంట్ల నిర్వహణ,ఇందిరమ్మ ఇళ్లను మహిళల పేరు మీదే మంజూరు చేస్తూ మహిళలను కోటీశ్వరులు చేయాలన్న ఉద్దేశంతో సీఎం రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని తెలిపారు.
ప్రభుత్వ పాఠశాలలకు ప్రోత్సాహం:
పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించే కుటుంబాలకు నల్లా పన్ను, ఇంటి పన్ను రద్దు చేస్తామని సర్పంచ్ ప్రకటించారు.ప్రతి ఒక్కరూ బాధ్యతగా పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని కోరారు.
మహిళలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకుంటూ వ్యవసాయ రంగంలో,ఆర్థికంగా, సామాజికంగా ముందు వరుసలో నిలవాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ సెక్రటరీ,వార్డు మెంబర్లు,మహిళలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.