బొగ్గు చోరీపై ప్రకటనలు అవాస్తవం
ప్రెస్ మీట్ లో పలు ఆసక్తికర అంశాలు వెల్లడి”
సింగరేణి లో అత్యంత పకడ్బందీగా బొగ్గు రవాణా: చింతల శ్రీనివాస్(ఏరియా జనరల్ మేనేజర్)
ప్రతి టన్ను బొగ్గుపై పటిష్ట పర్యవేక్షణ” బొగ్గు చోరీకు గురి అవుతుందని ఇటీవల చేస్తున్న ప్రకటనలలో ఎటువంటి నిజం లేదని అవాస్తవాలని ప్లానింగ్ అండ్ ప్రాజెక్ట్ డైరెక్టర్ కొప్పుల వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు.మంగళవారం సత్తుపల్లి శివారులో గల సింగరేణి సత్తుపల్లి ఏరియా జనరల్ మేనేజర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రెస్ మీట్ లో ముఖ్య అతిథిగా పాల్గొన్న కొప్పుల పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు.ఆయన మాట్లాడుతూ అత్యాధునిక సాంకేతికతతో పారదర్శక రవాణా వ్యవస్థ
సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ ( ఎస్సీ సి సి ల్ ) మైనింగ్ రంగంలో 137 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగిన ప్రతిష్టాత్మక సంస్థ అని దేశ ఇంధన భద్రతకు వెన్నెముకగా నిలుస్తూ, విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు మరియు పారిశ్రామిక వినియోగదారులకు నాణ్యమైన బొగ్గును సరఫరా చేస్తూ జాతీయ అభివృద్ధిలో కీలక పాత్ర సింగరేణి పోషిస్తోందనీ అట్టి సిరులిచ్చే సింగరేణి సంస్థపై
ఇటీవల సింగరేణిలో బొగ్గు మాయమైందని భారీ స్థాయిలో బొగ్గు చోరీలు జరిగాయని చేస్తున్న ఆరోపణలు వాస్తవాలకు దూరంగా ఉండటమే కాకుండా సంస్థ అభివృద్ధికి అంకితభావంతో పనిచేస్తున్న వేలాది మంది ఉద్యోగుల మనోధైర్యాన్ని దెబ్బతీసే విధంగా ఉన్నాయనీ తక్షణమే అట్టి వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని హితవు పలికారు.
అనంతరం జనరల్ మేనేజర్ చింతల శ్రీనివాస్ మాట్లాడుతూ సింగరేణిలో అమలులో ఉన్న బొగ్గు రవాణా,భద్రతా వ్యవస్థలు, సాంకేతిక పర్యవేక్షణ విధానాల గురించి వివరించారు.
బొగ్గు రవాణా వ్యవస్థ
సింగరేణిలో ఉత్పత్తి అయ్యే బొగ్గులో సుమారు 85 శాతం రైల్వే మార్గం ద్వారా, మిగిలిన 15 శాతం రోడ్డు మార్గం ద్వారా వినియోగదారులకు సరఫరా చేయబడుతోందన్నారు.
బొగ్గు ఉత్పత్తి అయిన క్షణం నుంచి వినియోగదారుడి వద్దకు చేరే వరకు ప్రతి దశలో డిజిటల్ పర్యవేక్షణ, భద్రతా తనిఖీలు, ఆన్లైన్ రికార్డింగ్ వ్యవస్థలు అమల్లో ఉంటాయినీ స్పష్టం చేశారు.
రోడ్డు మార్గం ద్వారా బొగ్గు రవాణా హైదరాబాద్ లోని మార్కెటింగ్ విభాగం ద్వారా ఎస్ఏపి ఆధారిత వ్యవస్థలో బొగ్గు కేటాయింపులు జరుగుతాయిన్నారు.ఏ వినియోగదారుడు ఏ గని నుంచి, ఎంత పరిమాణంలో, ఎప్పుడు బొగ్గు స్వీకరించాలో ముందుగానే డిజిటల్ గా కేటాయించబడుతుందనీ తెలిపారు.
వాహనం గని లేదా కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్ (సి హెచ్ పి) వద్దకు చేరిన వెంటనే
ఖాళీ వాహనం బరువును ఎలక్ట్రానిక్ వే బ్రిడ్జి వద్ద నమోదు అవుతుందన్నారు.
వాహనం సంఖ్య, వినియోగదారుడి వివరాలు ఎస్ ఏ పి యాప్ వ్యవస్థలో నమోదవుతాయన్నారు.
నిర్దేశిత పరిమాణంలో బొగ్గు లోడింగ్ నిర్వహిస్తామన్నారు.
అనంతరం ఆర్ ఎఫ్ ఐ డి,ఆధారిత బూమ్ బ్యారియర్లు కలిగిన వే బ్రిడ్జిల వద్ద మళ్లీ తూకం వేయడం జరుగుతుందన్నారు.
కేటాయించిన పరిమాణానికి అనుగుణంగా బొగ్గు లోడ్ అయిన తర్వాత మాత్రమే కంప్యూటర్ జనరేట్ చేసిన అధికారిక వే-బిల్ జారీ చేసి వాహనాన్ని విడుదల చేస్తారు.
వాహనం బయలుదేరిన వెంటనే ఆ సమాచారం వినియోగదారుడికి, మార్కెటింగ్ విభాగానికి, సంబంధిత అధికారులకు ఆన్లైన్ ద్వారా చేరుతుంది.
జిపిఎస్ -జియోఫెన్సింగ్ ఆధారిత పర్యవేక్షణ
బొగ్గు రవాణా చేసే వాహనాలన్నింటికీ జిపిఎస్/ జిపిఆర్ఎస్ ట్రాకింగ్ వ్యవస్థ అమలులో ఉంది.
వాహనం ఎక్కడ ఉంది?
ఏ మార్గంలో వెళ్తంది?
ఎక్కడ ఆగింది?
గమ్యస్థానానికి చేరిందా?
అనే వివరాలు రియల్‌టైమ్ లో పర్యవేక్షించబడతాయినీ డిజిటల్ స్క్రీన్ పై చూయించారు.జియోఫెన్సింగ్ సాంకేతికత కారణంగా వాహనం నిర్దేశిత మార్గం నుంచి మళ్లితే సంబంధిత గని మేనేజర్, ప్రాజెక్ట్ అధికారి, సెక్యూరిటీ ఆఫీసర్‌కు వెంటనే హెచ్చరికలు వెళ్తాయి.
ఆర్ ఎఫ్ ఐ డి – సీసీటీవీ – బూమ్ బ్యారియర్ల సమగ్ర నిఘా,సింగరేణి గనులు, వెయిబ్రిడ్లజ్లు,సి హెచ్ పిలు, ఎంట్రీ- ఎగ్జిట్ గేట్లు, రైల్వే సైడింగ్‌లు, స్టాక్ యార్డుల వద్ద ఆర్ ఎఫ్ ఐ డి ఆధారిత బూమ్ బ్యారియర్లు, సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయబడ్డాయి.
వందలాది సీసీటీవీ కెమెరాలు 24 గంటలూ పనిచేస్తూ ప్రతి కదలికను రికార్డు చేస్తున్నాయిన్నారు.
సింగరేణిలోని అన్ని వెయిబ్రిడ్లజ్లు కోల్ నెట్ డిజిటల్ వ్యవస్థకు అనుసంధానించబడ్డాయి.
ప్రతి లారీ, ప్రతి వ్యాగన్ బరువు ఆన్లైన్లో నమోదు అవుతుంది.లోడింగ్ పాయింట్ వద్ద నమోదైన బరువు, అన్లోడింగ్ సమయంలో నమోదైన బరువుతో సరిపోల్చబడుతుందన్నారు. ఏదైనా తేడా ఉంటే సంబంధిత రవాణా కాంట్రాక్టర్ నుంచి నష్టపరిహారం వసూలు చేయబడుతుంది.కాపోస్టులు- భౌతిక తనిఖీలు అన్ని ఎంట్రీ, ఎగ్జిట్ ద్వారాల వద్ద చెకోపోస్టులు,వాహనాల భౌతిక తనిఖీలు
హోలోగ్రామ్ కలిగిన అధికారిక చలానాలు ఉంటాయన్నారు.
రైలు మార్గం ద్వారా బొగ్గు రవాణా ఫ్యూయల్ సప్లై అగ్రిమెంట్ల (ఎఫ్ ఎస్ ఏ) ప్రకారం విద్యుత్ కేంద్రాలు మరియు ఇతర భారీ వినియోగదారులు సింగరేణి వివిధ సిహెచ్ వి ల నుంచి బొగ్గు స్వీకరిస్తారన్నారు.
రైల్వే శాఖ కేటాయించిన రేకుల్లోప్రతి వ్యాగన్‌కు నిర్దిష్ట పరిమాణంలో బొగ్గు లోడింగ్ జరుగుతుందన్నారు.
మొత్తం ప్రక్రియ ఎస్ ఏ పి ఆధారంగా నిర్వహించబడుతుంది.
లోడింగ్ పూర్తయిన వెంటనే వినియోగదారునికి డిజిటల్ సమాచారం అందుతుందన్నారు.
అనంతరం రైల్వే శాఖ బొగ్గును గమ్యస్థానానికి తరలిస్తుందన్నారు.
ప్రతీ రోజూ గస్తీ సింగరేణి సెక్యూరిటీతో ఉంటుందన్నారు.
ఫ్లయింగ్ స్క్యాడ్
ఆకస్మిక తనిఖీలు ఉంటాయన్నారు.
చెకోపోస్టులు, స్టాక్ యార్డులు, రవాణా మార్గాలపై సర్ప్రైజ్ రైడ్లు,
సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి నుంచి వినియోగదారుని వరకు ప్రతి టన్ను బొగ్గు ఆర్ ఎఫ్ ఐ డి,జిపిఎస్,సీసీ టీవీ,కోల్ నెట్,ఎలక్ట్రానిక్ వెయిబ్రిడ్జ్‌లు, సింగరేణి సెక్యూరిటీ, ఫ్లయింగ్ స్క్వాడ్లు, హోలోగ్రామ్ చలానాలు. టాస్క్ ఫోర్స్ పర్యవేక్షణ వంటి బహుళస్థాయి సాంకేతికత. భద్రతా వ్యవస్థల మధ్య నిర్వహించబడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో: సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ కావ్య, జె వి ఆర్ ఓసి పిఓ ప్రహ్లాద తదితర సింగరేణి అధికారులు పాల్గొన్నారు.