కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక. రైతు. కూలీల వ్యతిరేక విధానాలపై పోరాటాలు చేయాలని *తెలంగాణ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్యచంద్ర నాయక్ పిలుపునిచ్చారు. శుక్రవారం పాలకుర్తి మండల కేంద్రంలో వీరనారి తెలంగాణ రైతాంగ సాయుదా పోరాట యోధురాలు ఐలమ్మ స్మారక భవనంలో సిఐటియు. రైతు సంఘం. వ్యవసాయ కార్మిక సంఘం సన్నాహక సమావేశం నిర్వహించారు. *ఈ సమావేశానికి సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి చిట్యాల సోమన్న అధ్యక్షత వహించగా* చందునాయక్ పాల్గొని మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రైతాంగానికి రాతపూర్వకంగా ఇచ్చిన హామీని తుంగలో తొక్కిందని కనీసం మద్దతు ధరల చట్టం చేస్తానని అమలు చేయలేదన్నారు. ఎరువుల సబ్సిడీని కుదించడం వల్ల రైతాంగానికి ఆహార భద్రతకు తీవ్ర ముప్పు వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. బ్రిటిష్ కాలం నుండి కార్మికులు పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను రద్దుచేసి పనిగంటల విధానాన్ని పెంచి కార్మికులు యూనియన్ పెట్టుకునే అవకాశాన్ని లేకుంట చేసి నాలుగు లేబర్ కోడ్లను తెచ్చి కార్మికుల నడ్డి విరుస్తున్నారన్నారు. కార్మికుల కనీస వేతనం 26 వేలు ఇవ్వాలన్నారు. గ్రామీణ ప్రాంతంలో పేదలకు ఉపాధిని చూపిస్తున్న గ్రామీణ ఉపాధి పథకానికి నిధులకు కోతలు పెట్టిందని అన్నారు. కనీసం 200 రోజులు పని కల్పించాలని కానీ కేంద్ర ప్రభుత్వం గత సంవత్సరం కంటే నిధులు తగ్గించిందన్నారు. ఈనెల 11న పాలకుర్తిలో సీఐటీయూ. రైతు సంఘం. వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో మండల సదస్సు నిర్వహించడం జరుగుతుందని ఈ సదాస్సుకు.కార్మికులు. రైతులు. వ్యవసాయ కూలీలు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు సోమసత్యం, రైతు సంఘం మండల కార్యదర్శి పనికిరా రాజు, ప్రజా సంఘాల మండల నాయకులు శ్రీలత, కే రమేష్, జి రాము, కే స్వామి తదితరులు పాల్గొన్నారు.

About The Author

By E69NEWS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *